NTV Telugu Site icon

Madya Pradesh: పీచు మిఠాయితో ఎనిమిదేళ్ల బాలికకు ఎర.. ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం

Madhya Pradesh Rape

Madhya Pradesh Rape

మధ్యప్రదేశ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. భింద్ జిల్లాలో ఎనిమిదేళ్ల బాలికపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికకు పీచు మిఠాయి ఇస్తానని ఆశ చూపి దారుణానికి ఒడిగట్టాడు. నిందితుడు ఓ కిరాణం షాపును నడుపతున్నాడు. కాగా.. ఈ ఘటనలో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

Read Also: Delhi: ముసుగులు ధరించుకుని వచ్చి ఓ కుటుంబంపై కర్రలు, రాడ్లతో దాడి..

ఈ ఘటన జిల్లాలోని గోహద్ పట్టణంలో శనివారం (ఆగస్టు 10) రాత్రి జరిగింది. కాగా.. ఆదివారం (ఆగస్టు 11) ఈ ఘటనపై కేసు నమోదైందని పోలీసు సూపరింటెండెంట్ అసిత్ యాదవ్ తెలిపారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు.. నిందితుడు బాలికకు పీచు మిఠాయి ఇస్తానని ఆశ చూపించాడని.. ఆ తర్వాత తన కూతురిని తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడని తల్లి పోలీసులకు తెలిపింది. అంతేకాకుండా.. అత్యాచారం చేసిన తర్వాత బాలికకు నిందితుడు రూ.20 ఇచ్చాడు.

Read Also: Stock market: హిండెన్‌బర్గ్‌ నివేదిక ఎఫెక్ట్.. ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు

ఆ డబ్బులు తీసుకుని ఇంటికి వచ్చిన బాలిక.. అనుమానంతో తల్లి డబ్బులు ఎక్కడివని అడగగా ఆ బాలిక జరిగిన విషయాన్ని తల్లికి చెప్పింది. అనంతరం తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి భారతీయ న్యాయ సంహిత (బిఎన్‌ఎస్), లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం (పోక్సో) చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Show comments