NTV Telugu Site icon

Buffalo Seized: ఇదేందయ్యో.. నీటి పన్ను బకాయి ఉందని గేదెను తీసుకెళ్లారు..

Buffalo Seized

Buffalo Seized

Buffalo Seized: నీటి పన్ను చెల్లించడంలో విఫలమైనందుకు డెయిరీ నిర్వాహకుడికి చెందిన గేదెను మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ మున్సిపల్ కార్పొరేషన్ (జీఎంసి) శుక్రవారం స్వాధీనం చేసుకుంది. మొండిగా వ్యవహరించే ఎగవేతదారుల నుంచి ఆస్తి, నీటి పన్ను బకాయిలను వసూలు చేయడంలో భాగంగా ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.రూ.1.39 లక్షల నీటిపన్ను చెల్లింపులో జాప్యం చేసినందుకు డెలియన్ వాలా ప్రాంతానికి చెందిన డెయిరీ నిర్వాహకుడు బాల్కిషన్ పాల్ పేరుతో కార్పొరేషన్ పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ (పీహెచ్‌ఈ) విభాగం నోటీసు జారీ చేసింది.

బాకీ ఉన్న నీటి పన్నును చెల్లించాలని బాల్కిషన్‌ను పలుమార్లు కోరినప్పటికీ హెచ్చరించినా పట్టించుకోలేదు. తర్వాత గ్వాలియర్ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు చెందిన కార్పొరేషన్ పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ (పీహెచ్‌ఈ) విభాగం తుది నోటీసును జారీ చేసింది. కొన్ని రోజుల్లోగా చెల్లించాల్సిన నీటి పన్ను బకాయిలను చెల్లించాలని అతనికి అల్టిమేటం ఇచ్చింది. దీని తర్వాత కూడా బాల్కిషన్‌ నీటి పన్ను చెల్లించకపోవడంతో అధికారుల బృందం అతని వద్దకు చేరుకుని గేదెను జప్తు చేసింది.

Read Also: Man Kills Wife: కాళ్లు చేతులు కట్టి గొంతుకోసి భార్య హత్య.. ఆపై రైలు కింద దూకి..

గ్వాలియర్ మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ కిషోర్ కన్యల్ మాట్లాడుతూ.. యజమాని నోటీసులు అందుకున్నప్పటికీ సకాలంలో పన్ను చెల్లించడంలో విఫలమైతే, అటాచ్‌మెంట్‌ ప్రక్రియను ప్రారంభిస్తామన్నారు. అనంతరం అతని చర లేదా స్థిరాస్తికి తుది నోటీసు జారీ చేయబడుతుందని, జప్తు చేయబడిందని తెలిపారు. “ఒక డెయిరీ నిర్వాహకుడు సకాలంలో నీటి పన్ను చెల్లించడంలో విఫలమైనందున మేము అతని గేదెను స్వాధీనం చేసుకున్నాము. అతని పేరుపై మొత్తం ₹ 1.39 లక్షల నీటి పన్ను పెండింగ్‌లో ఉంది” అని గ్వాలియర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ తెలిపారు.