Site icon NTV Telugu

Madhya Pradesh: పండగ రోజు సీఎంకు తప్పిన ముప్పు.. హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్!

Madhya Pradesh

Madhya Pradesh

Madhya Pradesh Chief Minister: సంక్రాతి పండుగ రోజు త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్ చౌహాన్. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్​ సింగ్ చౌహాన్‌ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య తలెత్తడం వల్ల టేకాఫైన ప్రదేశానికే తిరిగి వచ్చి ల్యాండ్‌ అయ్యింది. ధార్​ వెళ్లేందుకు హెలికాప్టర్​ మనావర్ నుంచి బయలుదేరిన హెలికాప్టర్… కొంత దూరం ప్రయాణించగానే సాంకేతిక సమస్య తలెత్తడం వల్ల వెంటనే తిరిగి వెనక్కి వచ్చినట్లు సబ్-డివిజనల్ ఆఫీసర్ ఆఫ్ పోలీస్ ధీరజ్​బబ్బర్ తెలిపారు.

NCP MP Supriya Sule: ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే చీరకు మంటలు.. వీడియో వైరల్

అనంతరం ముఖ్యమంత్రి శివరాజ్​ సింగ్​చౌహాన్​ రోడ్డు మార్గంలో ధార్‌కు వెళ్లినట్లు చెప్పారు. అనంతరం ముఖ్యమంత్రి రోడ్డు మార్గంలో మనావర్‌కు 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధార్‌కు బయలుదేరారు. మనావర్‌లో ఓ కార్యక్రమం అనంతరం ధార్ జిల్లాలో జరిగే బహిరంగ ర్యాలీలో ఆయన ప్రసంగించాల్సి ఉంది.

 

Exit mobile version