Site icon NTV Telugu

Madhu Goud Yaski: నారాయణ కాలేజ్ పై కఠిన చర్యలు తీసుకోవాలి

Madhu

Madhu

హైదరాబాద్ లోని రామంతాపూర్ నారాయణ కాలేజీ ఘటనపై ప్రభుత్వం వెనువెంటనే తీవ్ర చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేత మధుయాష్కీ గౌడ్ డిమాండ్ చేశారు. నారాయణ యాజమాన్యంపై వెంటనే క్రిమినల్ కేసులతో సహా హత్యనేరం కేసులు నమోదు చేయాలి. నారాయణ విద్యాసంస్థల అనుమతులు వెంటనే రద్దు చేయాలి.ఇది కల్వకుంట్ల కుటుంబ స్కామ్. సర్టిఫికెట్లు ఇవ్వకపోతే విద్యార్థి విద్యాసంవత్సరం కోల్పోతాడు.. ఫీజులు కట్టకపోతే వేరే మార్గాల ద్వారా తీసుకోవాలి తప్ప.. సర్టిఫికెట్లు ఇవ్వవద్దని ఏ చట్టంలోనూ లేదన్నారు మధు యాష్కీ.

నారాయణ యాజమాన్యం చేసింది.. రాజ్యాంగ వ్యతిరేక చర్య.. ఇది అత్యంత హేయమైన, దారుణమైన చర్యగా అభివర్ణిస్తున్నాను. తెలంగాణ ఉద్యమ సమయంలో కార్పరేట్ కాలేజీలు దోచుకుంటున్నాయని చెప్పిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. మండల కేంద్రాల్లోకి సైతం నారాయణ చైతన్య కాలేజీలు విస్తరించాయి. ఉమ్మడి రాష్ట్రంలో జిల్లా కేంద్రాల్లో సైతం ఇవి లేవు. మండల కేంద్రాలకు సైతం నారాయణ, చైతన్య విద్యాసంస్థలు వచ్చి.. ప్రజల రక్తాన్ని తాగుతున్నాయి. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగినా కేసీఆర్ ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు… తగిన చర్యలు తీసుకోలేదు.

నారాయణ సంస్థల్లో మంత్రి హరీష్ రావు, బిడ్డ కవితలకు భాగస్వామ్యం ఉండడం వల్లే చర్యలు తీసుకోవడం లేదనే వార్తలు వస్తున్నయి. వీరి అండదండలు ఉండడం వల్లే ఈ కాలేజీలే ఇలే పెట్రేగిపోతున్నాయి. ప్రభుత్వం ఈ ఘటన తరువాత కూడా చర్యలు తీసుకోకపోతే హరీష్ రావు, కవితలకు భాగస్వామ్యం ఉన్నట్లు నిరూపితం అవుతుంది. ఈఘటనకు మొత్తం బాధ్యత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నా అన్నారు మధుయాష్కీ. నారాయణ, చైతన్య కాలేజీలు టీవీలు,పేపర్లలో ప్రకటనల కోసమే వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాయంటే.. ఎన్ని వేల కోట్ల రూపాయలను ప్రజలనుంచి పీడిస్తున్నారో అర్థం అవుతోంది. గాయపడ్డ విద్యార్థులకు నారాయణ యాజమాన్యం మెరుగైన చికిత్సను అందించాలి. తెలంగాణలోని ప్రవేట్ టీచర్లు అంతా మేల్కోవాలన్నారు మధు యాష్కీ.

Read Also: Soldier Killed: ఇండియా-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉగ్రదాడి.. జవాన్ వీరమరణం

Exit mobile version