Site icon NTV Telugu

టీఆర్‌ఎస్‌ పార్టీ పురోభివృద్ధికి కృషి చేస్తా: తాత మధు

ఇటీవల ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీగా గెలిచిన తాతామధు గురువారం మీడియాతో మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ పార్టీ పురోభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. పార్టీలో ఉన్న చిన్న చిన్న గ్యాప్‌లను భర్తీ చేస్తానన్నారు. అందరిని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తానని చెప్పారు. పార్టీలో నిర్మాణ పరమైన సమస్యలను పరిష్కారం చేసే దిశగా తన వంతు సాకారం అందిస్తానని వెల్లడించారు. తెలంగాణ సిద్ధాంతం ను, తెలంగాణ ఏర్పడడానికి గల కారణాలను ప్రజల వద్దకు తీసుకుని ముందుకు వెళ్తాం అన్నారు. పార్టీని ఒక్క విజ్ఞాన కేంద్రంగా తయారు చేస్తామన్నారు. జిల్లాలో రాబోయే ఎన్నికలకు పార్టీని ఇప్పటి నుంచే సన్నద్ధం చేస్తామన్నారు. జిల్లాలో ప్రజా ప్రతినిధుల సహకారాన్ని తీసుకుంటామని ఆయన వెల్లడించారు. జిల్లాలో పార్టీ నేతల మధ్య సమన్వయం చేయడంతోపాటు పార్టీకి తన సేవలను అందజేస్తానని పేర్కొన్నారు.

Exit mobile version