Madhavi Latha: జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల అవ్వడంతో రాష్ట్ర రాజధానిలో రాజకీయ వాతావరణం వేడి ఎక్కింది. అయితే ప్రముఖ రాజకీయ పార్టీలు జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానంలో ఎవరిని బరిలోకి దించాలని తెగ చర్చలు చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ నేత మాధవీ లత జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలు సంబంధించి ఎన్.టి.వి తో ముఖాముఖిగా చర్చించారు. ఈ సందర్బంగా మే మాట్లాడుతూ.. బీజేపీ అభ్యర్ధిగా అవకాశం ఇవ్వాలని అధిష్ఠానాన్ని కోరినట్లు తెలిపారు. ఇందుకోసం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ డా. లక్ష్మణ్ ను కలిసినాట్లు ఆమె తెలిపారు.
Fire Accident: ఏపీలో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం..
జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని బీజేపీ పెద్దలను కలిసి విజ్ఞప్తి చేస్తున్నానని.. ఈ ఉప ఎన్నికలు పార్టీకి చాలా ముఖ్యమైనవని అన్నారు. ప్రజలకు బీజేపీ పట్ల నమ్మకం, ప్రేమ, అభిమానం విపరీతంగా ఉందని మాధవీ లత తెలిపారు. తెలంగాణ ప్రజలకు బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల పాలనల వల్ల నష్టం జరిగిందని.. ఇప్పుడు ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు. అధిష్ఠానం పరిశీలిస్తున్న అభ్యర్థుల జాబితాలో నా పేరూ ఉందని తెలిసింది. అవకాశం ఇస్తే ఎన్నికల యుద్ధానికి సిద్ధంగా ఉంటానని ఆమె స్పష్టం చేశారు.
iPhone 15: కొంటే ఐఫోన్ నే కొనాలనుకుంటున్నారా?.. అయితే ఐఫోన్ 15 పై ఈ డీల్ మిస్ చేసుకోకండి
అదేవిధంగా.. అవకాశం రాకపోయినా, ఒక పోలింగ్ బూత్ బాధ్యతలు ఇచ్చినా సంతోషంగా స్వీకరిస్తాను. గెలుపు కోసం కృషి చేస్తాను. ఢిల్లీ, వారణాసి, ఝార్ఖండ్, మహారాష్ట్ర వంటి పలు రాష్ట్రాల్లో బీజేపీ గెలుపు కోసం పనిచేశానని తెలిపారు. తన రాజకీయ ప్రయాణం బీజేపీ పెద్దల ఆశీర్వాదం, అభిమానంతోనే కొనసాగుతోందని మాధవీ లత పేర్కొన్నారు. గత 18 నెలలుగా పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్నానని ఆమె అన్నారు.
