Site icon NTV Telugu

Madhavaram Krishna Rao : బాలానగర్‌లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాదయాత్ర

Madhavaram Krishna Rao

Madhavaram Krishna Rao

కూకట్‌పల్లి బాలానగర్ లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాదయాత్ర చేశారు. ఈ తొమ్మిదిన్నర ఏళ్ల కాలంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ మరియు ప్రజల సమస్యల తెలుసుకొనుటకు పాదయాత్ర ప్రారంభించారు మాధవరం. వాణి సొసైటీ, ఫిరోజ్ గూడ, శివాలయం వీధి , మసీద్ గల్లీ, ఫూల్ బాగ్ కాలనీ, సత్తిరెడ్డి కాలనీ , హరిజన బస్తీ, అనంతమ్మ గూడ, వరలక్ష్మి వీధి తదితర ప్రాంతాల్లో పాదయాత్ర చేశారు మాధవరం కృష్ణారావు. స్థానికులతో మాట్లాడుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకుని అధికారులతో మాట్లాడి సత్వరమే పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు.

Also Read : Suprem Court: మణిపూర్‌ అల్లర్లపై నిగ్గు తేల్చడానికి ముగ్గురు మాజీ మహిళా జడ్జిలతో కమిటీ

పెద్దగా సమస్యలు లేకపోయినా …ప్రధానంగా పెండింగ్లో ఉన్న రోడ్లు.. విద్యుత్ స్తంభాలు మరియు లైట్లు,పెన్షన్ లు సంబంధించినటువంటి చిన్న చిన్న సమస్యలు వచ్చాయి వాటిని సత్వరమే అధికారులతో మాట్లాడీ తిరుస్తున్నమని తెలిపారు. ప్రజలకు మౌలిక సదుపాయాలు అందించే విషయంలో ఎక్కడైనా ఇబ్బంది ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రోడ్లు డ్రైనేజ్ పనులను పూర్తి చేశామని పెండింగ్లో ఉన్న పనులను సైతం త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అధికారులకు ఆదేశించారు.. ఈ సందర్భంగా కొంతమంది మహిళలు డబుల్ బెడ్ రూమ్, పింఛన్లకు సంబంధించి వినతి పత్రాలు అందించగా వెంటనే అవి అధికారులకు అందించి పరిశీలన చేయాలని ఆదేశించారు..

Also Read : Abbas: విశాల్ చాలామందిని పాడు చేశాడు.. అందుకే అతడంటే పగ

Exit mobile version