కొంత మంది అసభ్య ప్రచారం చేస్తూ పబ్బం గడుపు కుంటున్నారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.. ఇవాళ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాదయాత్రలో చితరమ్మ బస్తి వద్ద 50 లక్షల విలువైన డబల్ బెడ్ రూములు ఈ ప్రాంతంలో కట్టించి ఇచ్చినందుకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకి కృతజ్ఞతలు తెలిపారు. డివిజన్ స్థానికులు మంచి నీరు నిరంతర విద్యుత్, రోడ్లు వంటి మౌలిక సదుపాయాలు సక్రమంగా అందుతున్నాయని ఇందులో ఎటువంటి ఇబ్బందులు లేవని తెలిపారు. అయితే కొంతమంది లబ్ధిదారులకు పింఛన్లు రావడం లేదని ఫిర్యాదు చేయగా వెంటనే సంబంధిత అధికారులకు వారికి పింఛన్లు అందేటట్లు ఏర్పాటు చూడాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ మంచినీరు, విద్యుత్ రోడ్లు వంటి ఇతర మౌలిక సదుపాయాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్ నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రజలకు అందిస్తున్నారని అలాగే సంక్షేమ పథకాల విషయంలో కూడా లబ్ధిదారులందరికీ కూడా పథకాలు అందేటట్లు ఏర్పాట్లు చేస్తున్నారని ఇందులో ఎవరు ఆందోళన చెందాల్సిన పనిలేదని చెప్పారు.కొంతమంది అసత్య ప్రచారాలు చేసి వారి పబ్బం గడుపుకుంటున్నారని అటువంటి వారి మాటలను ఎట్టి పరిస్థితుల్లో నమ్మ వద్దు అని ప్రజలకు తెలియజేశారు.
ఇదిలా ఉంటే.. కూకట్పల్లి నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి వివిధ పార్టీల వారు సైతం బీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.బాలాజీనగర్ డివిజన్‌కు చెందిన బీజేపీ మహిళా మోర్చ అధ్యక్షురాలు వీరంగంటి జ్యోతి జగదీష్ గురువారం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారవు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన జ్యోతికి కండువ కప్పి ఎమ్మెల్యే బీఆర్ఎస్లోకి స్వాగతించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం కోఆర్డినేటర్ సతీష్ అరోరా తదితరులు పాల్గొన్నారు.