Site icon NTV Telugu

Madhapur IT Company Scam: మాదాపూర్‌లో బోర్డు తిప్పేసిన మరో ఐటీ కంపెనీ.. రోడ్డున పడ్డ 400 మంది..

It Company

It Company

Madapur IT Scam: మాదాపూర్‌లో మరో ఐటీ కంపెనీ బోర్డు తిప్పేసిన ఘటన వెలుగు చూసింది. ఈ ఘటన ప్రస్తుతం ఐటీ కారిడార్‌లో కలకలం రేపుతోంది. స్థానికంగా పేరొందినట్టు నటిస్తూ కార్యకలాపాలు నిర్వహించిన NSN ఇన్ఫోటెక్ ఘరానా మోసం బయటపడింది. శిక్షణ, ఉద్యోగ అవకాశం పేరుతో 400 మందికి పైగా నిరుద్యోగుల దగ్గర నుంచి మూడు లక్షల వరకు వసూలు చేసినట్టు బాధితులు చెబుతున్నారు. ఐటీ కంపెనీ అని నమ్మించి, ఉద్యోగం ఖాయం అని మాటలు చెప్పి భారీగా డబ్బులు తీసుకున్నారని తెలుస్తోంది.

READ MORE: Jagtial: భార్య చేతిలో మరో భర్త బలి.. రోకలి బండతో కొట్టి, మెడను కత్తితో నరికి చంపిన ధర్మపత్ని!

కంపెనీ యజమాని స్వామి నాయుడు ఈ మొత్తం మోసానికి మాస్టర్‌మైండ్‌గా గుర్తించారు. తాను ప్రైవేట్ ఛానల్ యజమాని అని చెప్పుకుని, నకిలీ ప్రతిష్టను సృష్టించి యువతను నమ్మించి టోకరా వేసినట్టు బాధితులు తెలిపారు. ప్రస్తుతం స్వామి నాయుడు పరారీలో ఉండగా, మోసపోయిన వారు సైబరాబాద్ కమిషనరేట్‌లోని EOW (ఎకనామిక్ ఆఫెన్సెస్ వింగ్) వద్ద ఫిర్యాదులు చేశారు. కంపెనీ ఆఫీసు ముందుకెళ్లిన బాధితులకు బోర్డు తిప్పేయబడిన ఖాళీ కార్యాలయం మాత్రమే కనిపించడంతో మోసం విషయం స్పష్టమైంది. ఈ ఘటనతో మాదాపూర్ ఐటీ ప్రాంతంలో కలకలం చెలరేగింది. యువతకు ఉద్యోగాల పేరిట మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

Exit mobile version