Madhapur IT Company Scam: మాదాపూర్‌లో బోర్డు తిప్పేసిన మరో ఐటీ కంపెనీ.. రోడ్డున పడ్డ 400 మంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madapur IT Scam: మాదాపూర్‌లో మరో ఐటీ కంపెనీ బోర్డు తిప్పేసిన ఘటన వెలుగు చూసింది. ఈ ఘటన ప్రస్తుతం ఐటీ కారిడార్‌లో కలకలం రేపుతోంది. స్థానికంగా పేరొందినట్టు నటిస్తూ కార్యకలాపాలు నిర్వహించిన NSN ఇన్ఫోటెక్ ఘరానా మోసం బయటపడింది. శిక్షణ, ఉద్యోగ అవకాశం పేరుతో 400 మందికి పైగా నిరుద్యోగుల దగ్గర నుంచి మూడు లక్షల వరకు వసూలు చేసినట్టు బాధితులు చెబుతున్నారు. ఐటీ కంపెనీ అని నమ్మించి, ఉద్యోగం ఖాయం అని మాటలు చెప్పి భారీగా డబ్బులు తీసుకున్నారని తెలుస్తోంది.
READ MORE: Jagtial: భార్య చేతిలో మరో భర్త బలి.. రోకలి బండతో కొట్టి, మెడను కత్తితో నరికి చంపిన ధర్మపత్ని!
Also Read
- AP Rain Alert: ఏపీలో రానున్న మూడు గంటలు పిడుగుపాటు హెచ్చరిక.. ఈ జిల్లాల వారు జాగ్రత్త..
- SRH Player: ‘టీమిండియా ప్లేయర్ల రహస్యాలను తెలుసుకున్నాను.. ఇదంతా ఐపీఎల్ ఆడటం వల్లనే’..
- AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్.. ఉద్యోగుల బదిలీలపై నిషేధం పొడిగింపు..
- SIR: కొన్ని గంటల్లో ముగియనున్న SIR ఫారమ్‌ల సమర్పణ.. 60 శాతం నమోదు..
కంపెనీ యజమాని స్వామి నాయుడు ఈ మొత్తం మోసానికి మాస్టర్‌మైండ్‌గా గుర్తించారు. తాను ప్రైవేట్ ఛానల్ యజమాని అని చెప్పుకుని, నకిలీ ప్రతిష్టను సృష్టించి యువతను నమ్మించి టోకరా వేసినట్టు బాధితులు తెలిపారు. ప్రస్తుతం స్వామి నాయుడు పరారీలో ఉండగా, మోసపోయిన వారు సైబరాబాద్ కమిషనరేట్‌లోని EOW (ఎకనామిక్ ఆఫెన్సెస్ వింగ్) వద్ద ఫిర్యాదులు చేశారు. కంపెనీ ఆఫీసు ముందుకెళ్లిన బాధితులకు బోర్డు తిప్పేయబడిన ఖాళీ కార్యాలయం మాత్రమే కనిపించడంతో మోసం విషయం స్పష్టమైంది. ఈ ఘటనతో మాదాపూర్ ఐటీ ప్రాంతంలో కలకలం చెలరేగింది. యువతకు ఉద్యోగాల పేరిట మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
AP Rain Alert: ఏపీలో రానున్న మూడు గంటలు పిడుగుపాటు హెచ్చరిక.. ఈ జిల్లాల వారు జాగ్రత్త..
-
Varuna Yagam : ముగిసిన వరుణయాగం.. పాల్గొన్న సీఎం రేవంత్ దంపతులు
-
Kumari Aunty: సినిమాల్లోకి వస్తానని ఎప్పుడూ అనుకోలేదు!
-
Director Arrested: డ్రింక్ లో మత్తుమందు ఇచ్చి రేప్.. దర్శకుడు అరెస్ట్
-
Manchu Manoj: సినిమాకు కులం, గోత్రం ఉండదు.. మంచు మనోజ్ సంచలన కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!