Made in Heaven 2 OTT: ఓటీటీలోకి శోభిత ధూళిపాళ ‘మేడ్ ఇన్ హెవెన్ 2’.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sobhita Dhulipala’s Made in Heaven 2 Streaming On Amazon Prime Video: తెలుగమ్మాయి ‘శోభితా ధూళిపాళ’ తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. గూఢచారి, కురుప్, మేజర్, పొన్నియన్ సెల్వన్ సినిమాలతో తానేంటో నిరూపించుకున్నారు. శోభితా పేరుకు తెలుగమ్మాయి అయినా.. టాలీవుడ్ కంటే బాలీవుడ్లోనే ఎక్కువ క్రేజ్ సంపాదించారు. బీటౌన్లో వరుస సినిమాలతో అలరిస్తున్నారు. వెండి తెరపైనే కాదు.. ఓటీటీలోనూ సత్తాచాటున్నారు. శోభితా వెబ్ సిరీస్ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. తాజాగా ఆమె నటించిన వెబ్ సిరీస్ ‘మేడ్ ఇన్ హెవెన్ 2’ స్ట్రీమింగ్కు సిద్ధంగా ఉంది.
2019లో శోభిత ధూళిపాళ నటించిన వెబ్ సిరీస్ ‘మేడ్ ఇన్ హెవెన్’. ఇందులో శోభిత చేసిన ‘తారా ఖన్నా’ అనే వెడ్డింగ్ ప్లానర్ పాత్రకు మంచి మార్కులే పడ్డాయి. 2019లో మార్చి 8న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయిన ఈ సిరీస్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. శ్రీవాత్సవ దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్లో నిత్యా మెహ్రా, జోయా అఖ్తర్, అలంకృత, ప్రశాంత్ నాయర్ కీలక పాత్రలలో నటించారు. ఇక మేడ్ ఇన్ హెవెన్ పార్ట్ 2 కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
Also Read: SPY Movie OTT: నెల తిరగకుండానే.. ఓటీటీలోకి వచ్చేసిన ‘స్పై’ మూవీ! స్ట్రీమింగ్ ఎందులోనో తెలుసా?
మేడ్ ఇన్ హెవెన్ 2 స్ట్రీమింగ్ డేట్ను మేకర్స్ బుధవారం ప్రకటించారు. ఆగస్ట్ 10 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో పార్ట్ 2 స్ట్రీమింగ్ కానుందని ఓ ప్రత్యేక పోస్టర్ రిలీజ్ చేసింది. మరోవైపు శోభిత ధూళిపాళ కూడా ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ చేశారు. ‘చివరకు మేడ్ ఇన్ హెవెన్ 2 అధికారిక విడుదల తేదీ వచ్చేసింది. షాదీ బిజినెస్ చూసేందుకు మరోసారి సిద్ధంగా ఉండండి’ అని శోభిత రాసుకొచ్చారు. పార్ట్ 2లో కొత్త నటీనటులు కనిపించనున్నట్లు సమాచారం తెలుస్తోంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!