NTV Telugu Site icon

Made in Heaven 2 OTT: ఓటీటీలోకి శోభిత ధూళిపాళ ‘మేడ్‌ ఇన్‌ హెవెన్‌ 2’.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

Made In Heaven 2

Made In Heaven 2

Sobhita Dhulipala’s Made in Heaven 2 Streaming On Amazon Prime Video: తెలుగమ్మాయి ‘శోభితా ధూళిపాళ’ తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. గూఢచారి, కురుప్, మేజర్, పొన్నియన్ సెల్వన్ సినిమాలతో తానేంటో నిరూపించుకున్నారు. శోభితా పేరుకు తెలుగమ్మాయి అయినా.. టాలీవుడ్ కంటే బాలీవుడ్‌లోనే ఎక్కువ క్రేజ్ సంపాదించారు. బీటౌన్‏లో వరుస సినిమాలతో అలరిస్తున్నారు. వెండి తెరపైనే కాదు.. ఓటీటీలోనూ సత్తాచాటున్నారు. శోభితా వెబ్ సిరీస్ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. తాజాగా ఆమె నటించిన వెబ్ సిరీస్ ‘మేడ్ ఇన్ హెవెన్ 2’ స్ట్రీమింగ్‌కు సిద్ధంగా ఉంది.

2019లో శోభిత ధూళిపాళ నటించిన వెబ్ సిరీస్ ‘మేడ్ ఇన్ హెవెన్’. ఇందులో శోభిత చేసిన ‘తారా ఖన్నా’ అనే వెడ్డింగ్ ప్లానర్ పాత్రకు మంచి మార్కులే పడ్డాయి. 2019లో మార్చి 8న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయిన ఈ సిరీస్‏కు మంచి రెస్పాన్స్ వచ్చింది. శ్రీవాత్సవ దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్‌లో నిత్యా మెహ్రా, జోయా అఖ్తర్, అలంకృత, ప్రశాంత్ నాయర్ కీలక పాత్రలలో నటించారు. ఇక మేడ్ ఇన్ హెవెన్ పార్ట్ 2 కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read: SPY Movie OTT: నెల తిరగకుండానే.. ఓటీటీలోకి వచ్చేసిన ‘స్పై’ మూవీ! స్ట్రీమింగ్ ఎందులోనో తెలుసా?

మేడ్ ఇన్ హెవెన్ 2 స్ట్రీమింగ్ డేట్‌ను మేకర్స్ బుధవారం ప్రకటించారు. ఆగస్ట్ 10 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో పార్ట్ 2 స్ట్రీమింగ్ కానుందని ఓ ప్రత్యేక పోస్టర్ రిలీజ్ చేసింది. మరోవైపు శోభిత ధూళిపాళ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేశారు. ‘చివరకు మేడ్ ఇన్ హెవెన్ 2 అధికారిక విడుదల తేదీ వచ్చేసింది. షాదీ బిజినెస్ చూసేందుకు మరోసారి సిద్ధంగా ఉండండి’ అని శోభిత రాసుకొచ్చారు. పార్ట్ 2లో కొత్త నటీనటులు కనిపించనున్నట్లు సమాచారం తెలుస్తోంది.

Show comments