హైదరాబాద్‌లో గేమింగ్ స్థావరంపై మాదాపూర్ ఎస్ఓటీ బృందం దాడులు చేసింది. గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న గేమింగ్ స్థావరంపై మాదాపూర్ పోలీసులు మెరుపుదాడి చేశారు. ఖాజాగూడలో లేడి డాన్ మాధవి గేమింగ్ నిర్వహిస్తోంది. వ్యాపారస్తులే టార్గెట్‌గా ఈ గేమింగ్ జరుగుతోంది. హైదరాబాద్ వ్యాపారస్తులకు వల వేసి గేమింగ్ ఆట ఆడేలా ముగ్గులోకి దింపుతోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు మూడు ముక్కలాట నిర్వహిస్తోంది. దీంతో చాలా మంది వ్యాపారస్తులు లక్షలు పోగొట్టుకున్నారు. ఒక్కొక్క ఆటకు రూ. వెయ్యి వసూలు చేస్తోంది. గేమింగ్‌తో పాటు ఆటాపాటా చేపడుతోంది. అనంతరం వ్యాపారస్తులను మత్తులోకి లేడి డాన్ దింపుతోంది.
ఇది కూడా చదవండి: Sreeleela: క్యూట్ క్యూట్ అందాలతో మెస్మరైజ్ చేస్తున్న శ్రీలీల…
మొత్తానికి పోలీసులు వల పన్ని గేమింగ్ ఆటను చిత్తు చేశారు. 9 మంది అరెస్ట్ చేశారు. వారి దగ్గర నుంచి రూ.62 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. 11 మొబైల్స్ ఫోన్స్, ఐదు సెట్స్ ప్లేయింగ్ కార్డ్స్‌ను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. గేమింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: TS SSC Results 2024: తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల.. బాలికలదే హవా..