Site icon NTV Telugu

Green India Challange : గ్రీన్ఇండియా చాలెంజ్ భాగంగా మొక్కలు నాటిన రమేష్ రెడ్డి

Madadi Ramesh

Madadi Ramesh

తన జన్మదినాన్ని పురస్కరించుకొని టీఆర్ఎస్ ఎల్పీ కార్యదర్శి మాదాడి రమేష్ కుమార్ రెడ్డి రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” లో భాగంగా మొక్కను నాటారు. అనంతరం మాదాడి రమేష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేపట్టిన “హరితహారం” కార్యక్రమంతో పాటు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చేపట్టిన అర్బన్ డెవలప్ మెంట్ కార్యక్రమాల్లో భాగంగా చేపట్టిన హరితహారంతో, అదే స్పూర్తితో రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” కార్యక్రమంలో కోట్లాది మొక్కలు నాటడం వల్ల తెలంగాణ నేలంతా పచ్చదనం పరుచుకుంది. ఈ కార్యక్రమాల కృషికి గుర్తింపుగా ప్రపంచ నగరాలను పక్కకు నెట్టి హైదరాబాద్ కు గ్రీన్ సిటీ అవార్డు-2022తో పాటు “లివింగ్ గ్రీన్ ఫర్ ఎకనామిక్ రికవరీ అండ్ ఇన్ క్లూజివ్ గ్రోత్” అవార్డులతో పాటు యాదాద్రి దేవాలయానికి “గ్రీన్ ప్లేస్ ఆఫ్ వర్షిప్” అవార్డు దక్కింది. ఇవే కాదు ఈ కృషిలో భాగంగానే జాతీయ స్థాయిలో తెలంగాణ పల్లెలకు పట్టణాలకు అనేక అవార్డులు దక్కాయన్నారు.

Also Read : T20 World Cup: ముగిసిన పాక్ ఇన్నింగ్స్.. భారత్ ముందు 160 లక్ష్యం
‘ఇంత అద్భుతమైన కార్యక్రమాలను ముందుకు తీసుకుపోతున్న కేసీఆర్ నాయకత్వంలో పనిచేయడం ఆ భగవంతుడు నాకు కల్పించిన మహదావకాశంగా భావిస్తున్నాను.. అంతేకాదు “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” లో భాగంగా నా పుట్టిన రోజున మొక్కలు నాటే అవకాశం కల్పించిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా జన్మదినం సందర్భంగా నాకు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతీ ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.’ అని మాదాడి రమేశ్‌ కుమార్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.

Exit mobile version