NTV Telugu Site icon

MAD Movie : ‘మ్యాడ్ ‘ మూవీ పై జాతిరత్నాలు డైరెక్టర్ ప్రశంసలు..

Mad

Mad

తెలుగు చిత్రపరిశ్రమలో వరుస హిట్ సినిమాలను నిర్మిస్తున్న సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ క్రేజీ అండ్ యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ ‘మ్యాడ్’తో అలరించడానికి రెడీ అవుతుంది..అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే నెల 6 న ప్రేక్షకుల ముందుకు రానుంది..రామ్ నితిన్, సంగీత్ శోభన్, నార్నే నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనీల్‌ కుమార్, గోపికా ఉద్యన్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాతో హారిక సూర్యదేవర నిర్మాతగా పరిచయం అవుతున్నారు. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పై సాయి సౌజన్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ సినిమాకి నూతన దర్శకుడు కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు..

సినిమా విడుదలకు కొద్ది రోజులు మాత్రమే ఉండటంతో సినిమా ప్రమోషన్స్ లో జోరును పెంచారు..మ్యాడ్ గ్యాంగ్ ని పరిచయం చేస్తూ మంగళవారం సాయంత్రం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఘనంగా జరిగిన ఈ వేడుకకు చిత్రం బృందంతో పాటు, ‘జాతిరత్నాలు’ ఫేమ్ దర్శకుడు అనుదీప్ సహా పలువురు హాజరయ్యారు. ఈ సినిమాలో అనుదీప్ కూడా నటించడం విశేషం..

ఈ సందర్బంగా డైరెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ.. దర్శకుడు కళ్యాణ్ నాకు పదేళ్లుగా స్నేహితుడు. కళ్యాణ్ లో చాలా ఎనర్జీ ఉంటుంది, హ్యూమర్ ఉంటుంది. ఎప్పుడూ మంచి కథలు రాస్తుంటాడు. ఈ సినిమా చాలా ఎనర్జీతో, చాలా హ్యూమర్ తో ఉంటుంది. కొత్తవాళ్ళని ప్రోత్సహిస్తూ నాగవంశీ గారు మరిన్ని సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను.. 6 న సినిమాను చూసి బాగా ఎంజాయ్ చేస్తారు.. జాతిరత్నాలు కన్నా ఈ సినిమా సూపర్ గా ఉంటుందని చెప్పుకొచ్చారు..

అనంతరం నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ.. జాతిరత్నాలు కంటే ఒక్కసారైనా తక్కువ నవ్వానని ఎవరైనా చెప్తే.. టికెట్ డబ్బులు వెనక్కి ఇచ్చేస్తాం. సినిమా పట్ల అంత నమ్మకం ఉంది. ఇది యూత్ ఫుల్ సినిమా అయినప్పటికీ, కుటుంబమంతా కలిసి చూసేలా ఉంటుంది. ఇంజనీరింగ్ కాలేజ్ లైఫ్ ని గుర్తు చేయడానికి తీసిన సినిమా ఇది. లాజిక్ లు, ట్విస్ట్ లు ఏముండవు. సినిమా మొదలైనప్పటి నుండి చివరివరకు నవ్వుతూనే ఉంటారు. కుటుంబంతో కలిసి అందరూ ఆనందించదగ్గ సినిమా ఇది అని నిర్మాత అన్నారు..

ఇక ఈ కార్యక్రమంలో ఒక్కొక్కరు సినిమా గురించి చెప్పారు.. సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో మ్యాడ్ చిత్రంలోని పాటలను పాడి ప్రేక్షకుల్లో ఉత్సాహం నింపారు. అక్టోబర్ 6న విడుదలవుతున్న ఈ సినిమా విజయం సాధిస్తుందనే నమ్మకం వ్యక్తం చేశారు… మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి..

Show comments