Machavaram Gas Leak: మాచవరంలో మరోసారి గ్యాస్ లీకేజ్ కలకలం.. భయాందోళనకు గురైన స్థానికులు!

Machavaram Gas Leak

Machavaram Gas Leak

Machavaram Gas Leak: అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం మాచవరంలో గ్యాస్ పైప్‌లైన్ లీకేజ్ మరోసారి కలకలం రేపింది. ఈనెల 26వ తేదీన పంట పొలాల్లో లీకైన పైప్‌లైన్‌ నుంచి మరోసారి గ్యాస్ లీక్ కావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పైప్‌లైన్‌ నుంచి గ్యాస్ ఎగసిపడటంతో చుట్టుపక్కల ప్రాంతమంతా గ్యాస్ వాసన వ్యాపించింది. దీంతో స్థానికులు తీవ్ర ఆందోళన చెందారు.

సమాచారం అందుకున్న ఓఎన్జీసీ అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. లీకేజీని అదుపులోకి తీసుకొచ్చి పరిస్థితిని సమీక్షించారు. ప్రస్తుతానికి ఎలాంటి ప్రమాదం లేదని అధికారులు చెప్పారు. గతంలో లీకైన పైప్‌లైన్‌ నుంచే మరోసారి గ్యాస్ లీక్ కావడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి లీకేజీని నియంత్రించినప్పటికీ తిరిగి అదే సమస్య తలెత్తడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తరచూ గ్యాస్ లీకేజీలు చోటుచేసుకోకుండా అధికారులు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.