Cycle Yatra: బాబు షూరిటీ-భవిష్యత్తు గ్యారెంటీ మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలను ప్రజల దృష్టికి తీసుకు వెళ్లడానికి కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు పట్టణంలో డాక్టర్ మాచాని సోమనాథ్ సైకిల్ యాత్రను చేపట్టారు. మహాశక్తి, యువ గళం, అన్నదాత, ఇంటింటికి నీరు, బీసీలకు రక్షణ చట్టం, పూర్ టు రిచ్ అనే ఆరు ప్రధానమైన అంశాలతో కోరుకున్న బాబు షూరిటీ-భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమాన్ని ప్రజల పెరిగి తీసుకుని వెళ్లడానికే సైకిల్ యాత్ర చేశానని డాక్టర్ మాచాని సోమనాథ్ తెలియజేశారు.
Read Also: Srisailam: రేపటి నుంచి శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు.. ఏ రోజున ఏ ఉత్సవమో తెలుసా!
డాక్టర్ మాచాని సోమనాథ్ సైకిల్ యాత్ర వారి ఇంటి నుండి మొదలుపెట్టి పెద్ద పార్కు, వైయస్సార్ సర్కిల్, గాంధీనగర్, ఆదోని బైపాస్ , శ్రీనివాస్ సర్కిల్ , సోమప్ప సర్కిల్ , గాంధీ సర్కిల్ , బాసర టెంపుల్, తీర్ బజార్, కార్ స్ట్రీట్ , లక్ష్మీపేట, మాచాని సోమప్ప స్కూలు , శ్రీనివాస్ టాకీస్ నుండి సోమప్ప సర్కిల్ వరకు యాత్ర కొనసాగింది. యాత్రలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చురుగ్గా పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడిని రాష్ట్ర ముఖ్యమంత్రి చేయడమే ప్రధాన లక్ష్యంగా ఈ యాత్ర సాగింది.