Site icon NTV Telugu

Barrelakka: బర్రెలక్కకు ‘మా’ మద్దతు.. బేషరతుగా శిరీషకి సపోర్ట్

New Project (7)

New Project (7)

Barrelakka: బర్రెలక్క..అలియాస్ శిరీష. ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల సందర్భంగా సోషల్ మీడియాలో ఈవిడ పేరు ట్రెండింగ్ లో ఉంది. 25 ఏళ్ల వయసులోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగుతోన్న బర్రెలక్కకు పోలింగ్ సమయం దగ్గరపడుతున్న కొద్దీ భారీగా మద్దతు లభిస్తోంది. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు బర్రెలక్క వీడియో ట్రెండింగ్‌లో ఉంటోంది. ఒక పేదింటి బిడ్డ… మంచి ఉద్యోగం సంపాదించి తన తల్లిదండ్రులను కుటుంబాన్ని సంతోషంగా ఉండేలా చూసుకుందామనుకుని ఎన్నో కలలు కన్న శిరీషకు ప్రభుత్వం నుంచి భంగపాటు కలిగింది. ఉద్యోగ నోటిఫికేషన్లు లేవు, పైగా పేపర్ లీకేజీలతో బర్రెలక్క మనసు ముక్కలైపోయింది. దీంతో చేసేదేమీ లేక బర్రెలు కాచుకుంటున్నానంటూ చేసిన ఒకే ఒక వీడియో ఆమెను ఈ స్థాయికి తీసుకొచ్చింది.

Read Also:CM KCR: నాలుగు నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభలు.. పాల్గొననున్న కేసీఆర్

అదే సమయంలో తెలంగాణలో ఎన్నికలు రావడంతో తానే ఎమ్మెల్యేగా ఎందుకు పోటీచేయకూడదని ఆలోచించింది. వెంటనే ఆ ఆలోచనను అమల్లో పెట్టింది. ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేసింది. తెలంగాణ నిరుద్యోగులు పడుతున్న కష్టాలను ఆమె తన ప్రచారాస్త్రాలుగా మలుచుకుంది. నిరుద్యోగ యువత నుంచే కాక పలు గ్రామాల్లో బర్రెలక్కకు పూర్తి మద్దతు లభిస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా తమ మద్దతు బేషరత్ గా బర్రెలక్కకే అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ మేరకు ఫేస్ బుక్లో సీనియర్ ఆర్టిస్ట్ సీవీఎల్ నరసింహా రావు పోస్ట్ చేశారు. MAA (Movie Artistes Association) of Telangana, RAKSHA బేషరతుగా మా బర్రెలక్కకి ( శిరీష ) కి సపోర్ట్ చేస్తున్నామని రాసుకొచ్చారు. బర్రెలక్క ఎంట్రీతో తమ ఓటు బ్యాంకుకు ఎక్కడ చిల్లు పడుతుందో అని రాజకీయ నాయకులు భయపడుతున్నారు. ఇక బర్రెలక్క ప్రచారంలో దూసుకెళుతోంది.

Read Also:RBI: వ్యక్తిగత రుణాలపై ఆర్ బిఐ కొత్త రూల్స్.. ఇక అప్పు పుట్టుడు కష్టమే..

Exit mobile version