Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒకప్పుడు స్నీకర్లను కేవలం క్రీడలకు లేదా సాధారణ అవసరాల కోసం ధరించే పాదరక్షలుగా మాత్రమే చూసేవారు. కానీ నేడు లగ్జరీ స్నీకర్స్ ఫ్యాషన్ రంగంలో అత్యంత కీలకమైన భాగంగా మారాయి. ఖరీదైన బ్రాండెడ్ వాటిని జిమ్ములు లేదా వాకింగ్‌కే పరిమితం చేయకుండా, ప్రజలు ఆఫీసులు, రెస్టారెంట్లు, పార్టీలు, సామాజిక వేడుకల్లో కూడా ఎంతో ఫ్యాషనబుల్‌గా ధరిస్తున్నారు. ఈ ధోరణి ప్రపంచవ్యాప్తంగా లగ్జరీ స్నీకర్స్ మార్కెట్‌ను భారీగా వృద్ధి చెందేలా చేస్తోంది. 2025 నాటికి ఈ మార్కెట్ సుమారు 46.2 బిలియన్ డాలర్లుగా ఉండగా, 2034 నాటికి ఇది సుమారు 98.7 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఇదే వృద్ధి వేగం కొనసాగితే 2031 నాటికి ఇది 75 బిలియన్ డాలర్ల మార్కును దాటే అవకాశం ఉంది.
ఈ మార్కెట్ విస్తరణలో ఆసియా-పసిఫిక్ ప్రాంతం అగ్రస్థానంలో నిలిచింది. 2025లో ప్రపంచ విక్రయాలలో ఈ ప్రాంతం వాటా సుమారు 37.4%గా నమోదైంది. ఇందులో ఒక్క చైనానే ప్రధాన డిమాండ్ కేంద్రంగా ఉండి, ఆసియా-పసిఫిక్ కొనుగోళ్లలో సుమారు 61% వాటాను కలిగి ఉంది. చైనాలో పెరుగుతున్న మధ్యతరగతి వర్గం, యువతలో ఫ్యాషన్ పట్ల మక్కువ, బలమైన రీసేల్ మార్కెట్ ఇందుకు ప్రధాన కారణాలు. అలాగే దక్షిణ కొరియాలో కే-పాప్ ప్రభావం, జపాన్‌లో బలమైన స్నీకర్స్ కల్చర్ ఈ మార్కెట్‌కు మరింత ఊతమిస్తున్నాయి.
Also Read
- Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో శ్వేతార్క గణపతి కల్యాణం.. భక్తులతో కిక్కిరిసిన ఎన్టీఆర్ స్టేడియం
- Dhoni Jersey: ధోనికి సీఎస్కే అరుదైన గౌరవం.. ఐకానిక్ నంబర్ 7 జెర్సీ రిటైర్..
- Ind Vs NZ: వెల్లింగ్టన్ టెస్టుకు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ.. ఫీజులో 35 శాతం కోత..
- Uttam Kumar Reddy : నీటి హక్కులపై వెనక్కి తగ్గేది లేదు.. బీఆర్ఎస్పై ఉత్తమ్ ఫైర్
ఈ సెగ్మెంట్లో గుచ్చి, గోల్డెన్ గూస్, బాలెన్సియా వంటి అంతర్జాతీయ బ్రాండ్లు ప్రత్యేక గుర్తింపు పొందాయి. బాలెన్సియాగా ట్రిపుల్ ఎస్, గోల్డెన్ గూస్ పాత లుక్‌తో కూడిన స్నీకర్స్ ఫ్యాషన్ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ లగ్జరీ పాదరక్షల ధరలు సాధారణంగా 400 డాలర్ల నుంచి 2,500 డాలర్ల వరకు ఉంటున్నాయి. పరిమిత సంఖ్యలో విడుదలయ్యే లిమిటెడ్ ఎడిషన్ మోడల్స్, సెలబ్రిటీల భాగస్వామ్యం ఈ డిమాండ్‌ను మరింత పెంచుతున్నాయి. డిజైన్ పరంగా చూస్తే లో-టాప్ స్నీకర్స్ అత్యధికంగా అమ్ముడవుతున్నాయి. 2025లో వీటి వాటా సుమారు 41.3%గా ఉంది. మెటీరియల్ పరంగా లెదర్ అగ్రస్థానంలో ఉన్నప్పటికీ, యువతలో సింథటిక్ , ప్లాంట్-బేస్డ్ మెటీరియల్స్‌కు గిరాకీ పెరుగుతోంది.
ఈ మార్కెట్ ఎదుగుదలలో జెన్ జెడ్ , మిల్లేనియల్స్ కీలక పాత్ర పోషిస్తున్నారు. 2025లో ఈ యువ కొనుగోలుదారుల సంయుక్త వాటా సుమారు 63.4%గా ఉంది. వీరు కేవలం బ్రాండ్ లోగో లేదా ధరను మాత్రమే కాకుండా, బ్రాండ్ విలువను, నాణ్యతను కూడా పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా 350 నుంచి 900 డాలర్ల ధర గల స్నీకర్స్ మార్కెట్ రాబడిలో సింహభాగాన్ని ఆక్రమిస్తున్నాయి. ఫ్యాషన్, సెలబ్రిటీ కల్చర్, సోషల్ మీడియా, రీసేల్ మార్కెట్ అన్నీ కలిసి లగ్జరీ స్నీకర్స్ వ్యాపారాన్ని సరికొత్త శిఖరాలకు చేరుస్తున్నాయి.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో నేడు విశేష ఘట్టం.. శ్వేతార్క గణపతి కల్యాణం
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో శ్వేతార్క గణపతి కల్యాణం.. భక్తులతో కిక్కిరిసిన ఎన్టీఆర్ స్టేడియం
-
Leopard Spotted : తండాలో చిరుత కలకలం.. బర్రె దూడను చంపి తినేసిన వైనం!
-
Dhoni Jersey: ధోనికి సీఎస్కే అరుదైన గౌరవం.. ఐకానిక్ నంబర్ 7 జెర్సీ రిటైర్..
-
Aakasamlo Oka Tara: స్టార్ హీరోయిన్లను కాదని ఆమెనే ఎందుకు తీసుకున్నామంటే? అసలు విషయం చెప్పిన పవన్ సాధినేని!
-
ఆ పుస్తకం చదివాకే Aakasamlo Oka Tara కథ పుట్టింది.. డైరెక్టర్ పవన్ సాధినేని ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..