Site icon NTV Telugu

LSG Owner Angry: కేఎల్ రాహుల్పై లక్నో సూపర్ జెంట్స్ ఓనర్ సీరియస్

Lsg Owner

Lsg Owner

LSG Owner Angry at KL Rahul: బుధవారం నాడు సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవి చూసింది. కేఎల్ రాహుల్ నేతృత్వంలోని లక్నో సూపర్‌జెయింట్‌కు ఇది వరుసగా రెండో ఓటమి. అంతకు ముందు కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో 98 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. 165 పరుగుల లక్ష్యాన్ని కేవలం 9.4 ఓవర్లలోనే ఛేదించిన హైదరాబాద్‌పై లక్నో ఓటమి మరింత ఇబ్బందికరంగా మారింది.

Read Also: Thalaimai Seyalagam: ఆసక్తిరేపుతున్న శ్రియా రెడ్డి పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ ‘తలమై సెయలగ‌మ్’ తెలుగు ట్రైలర్

కాగా, ఈ మ్యాచ్ తర్వాత లక్నో సూపర్‌జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా కెప్టెన్ కేఎల్ రాహుల్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ ప్రశాంతంగా అతడికి ఏదో చెప్పేందుకు ప్రయత్నిస్తున్నా.. కూడా ఆయన పెద్దగా పట్టించుకోలేదు. ఇక, కోచ్ జస్టిన్ లాంగర్ కూడా వచ్చిన సమయంలో ఎల్ఎస్జీ ఓనర్ కేఎల్ రాహుల్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తునే ఉన్నారు. ఆ టైంలో కెప్టెన్ రాహుల్ కాస్త అసౌకర్యంగా కనిపించడంతో అక్కడి నుంచి గోయెంకా వెళ్లిపోయాడు. దీంతో ఈ వీడియా కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక, సంజీవ్ గోయెంకాపై నెటిజన్స్ పెద్ద ఎత్తున విమర్శలు కురిపిస్తున్నారు. బీసీసీఐ అతడిని వీలైనంత త్వరగా ఐపీఎల్ నుంచి నిషేధించాలి అని డిమాండ్ చేస్తున్నారు. కేఎల్ రాహుల్ లాంటి కెప్టెన్‌ను కలిగి ఉండే అర్హత అతని జట్టుకు లేదన్నారు.

Read Also: Varalaxmi Sarathkumar :పెళ్లికి రెడీ అయి ఇప్పుడేంటి ఇలా అనేసింది?

అయితే, హైదరాబాద్‌లో బుధవారం నాడు జరిగిన మ్యాచ్‌లో లక్నో జట్టు నిర్ణయ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేయగలిగింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు 250 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసి కేవలం 58 బంతుల్లో ఆటను ముగించారు. లక్నో సూపర్‌జెయింట్స్‌కు ప్లేఆఫ్‌ల మార్గం కష్టంగా మారింది. ఆ టీమ్ తన తదుపరి రెండు మ్యాచ్‌లను తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పాడింది. అదే సమయంలో, సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయంతో ప్లే ఆఫ్ రేసు నుంచి ముంబై ఇండియన్స్‌ను ఎలిమినేట్ అయింది.

Exit mobile version