NTV Telugu Site icon

IPL 2025: లక్నో కెప్టెన్ పంత్, పూరనా..? సంజీవ్ గోయెంకా ఆన్సర్ ఇదే

Lsg

Lsg

2022లో ఐపీఎల్‌లోకి లక్నో సూపర్ జెయింట్స్ జట్టు అడుగుపెట్టింది. మొదటి నుంచి జట్టు కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ వ్యవహరించిన సంగతి తెలిసిందే.. అయితే.. తాజాగా జరిగిన మెగా వేలంలో లక్నో జట్టు రాహుల్‌ను రిలీజ్ చేసింది. ఈ క్రమంలో.. లక్నోకు కొత్త కెప్టెన్ ఎవరన్నదానిపై అందరి దృష్టి ఉంది. కాగా.. మెగా వేలంలో లక్నో ఐపీఎల్ చరిత్రలోనే రూ. 27 కోట్లు పెట్టి ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ కెప్టెన్ రిషబ్ పంత్‌ను కొనుగోలు చేసింది. అయితే.. అభిమానులందరూ పంత్‌ను కెప్టెన్ చేస్తారని అనుకుంటుండగా.. పోటీదారులో వెస్టిండీస్ ఆటగాడు నికోలస్ పూరన్ కూడా ఉన్నాడు.

Read Also: RGV : నాకు అరెస్ట్ వారెంట్ ఇవ్వలేదు.. పారిపోయానంటే ఎలా?

రిషబ్ పంత్, నికోలస్ పురాన్‌లలో లక్నో జట్టు తదుపరి కెప్టెన్‌గా ఎవరు ఉండాలనే దానిపై జట్టు యజమాని సంజీవ్ గోయెంకా తన అభిప్రాయాన్ని తెలిపారు. లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా.. 2025 ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్‌కు కెప్టెన్‌ని మరికొద్ది రోజుల్లో ప్రకటించనున్నట్లు వెల్లడించారు. గోయెంకా తన యూట్యూబ్ ఛానెల్‌లో ఆకాష్ చోప్రాతో మాట్లాడుతూ.. వచ్చే సీజన్‌లో కెప్టెన్‌గా ఎవరు ఉండాలనేది ఫ్రాంచైజీ ఇప్పటికే నిర్ణయించిందని, డిసెంబర్ మొదటి వారం చివరిలోగా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

Read Also: Mythri Movie Makers: పుష్ప 2 రిలీజ్ ముంగిట.. మైత్రీ మేకర్స్ వ్యూహాత్మక నిర్ణయం

ఐపీఎల్ 2025 కోసం లక్నో సూపర్ జెయింట్స్ రూ. 21 కోట్ల భారీ రుసుము చెల్లించి నికోలస్ పూరన్‌ను ఉంచుకుంది. రిషబ్ పంత్‌ను కూడా రూ.27 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. ఈ క్రమంలో.. తమ జట్టు కెప్టెన్సీ ఎంపికపై అభిమానులు ఆశ్చర్యపోనవసరం లేదని.. అయితే కెప్టెన్ ఎవరన్నది బయటికొచ్చే వరకు ఓపిక పట్టాలని సంజీవ్ గోయెంకా అన్నారు. తాను ఎవరినీ ఆశ్చర్యపరచనని.. మరికొద్ది రోజుల్లో ప్రకటిస్తామని చెప్పారు. రిషబ్ పంత్‌ను భారీ ధరకు కొనుగోలు చేయడంపై సంజీవ్ గోయెంకా స్పందిస్తూ.. ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడే సమయంలో లక్షణాలను తాను జాగ్రత్తగా పాటించారన్నారు.

Show comments