Site icon NTV Telugu

Nikhat Khan : లూసిఫ‌ర్2లో అమీర్ ఖాన్ సోదరి

New Project 2025 02 22t212910.033

New Project 2025 02 22t212910.033

Nikhat Khan : మ‌ల‌యాళ సూపర్ స్టార్ మోహ‌న్ లాల్ హీరోగా న‌టించిన లూసిఫర్ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పొలిటిక‌ల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా 2019లో విడుదలై బాక్సాఫీస్ వ‌ద్ద బాగానే కలెక్ట్ చేసింది. హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రీక్వెల్ గా ఇప్పుడు పార్ట్2 ను నిర్మించారు. ఎల్2: ఎంపురాన్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రిలీజ్ ద‌గ్గర పడుతున్న నేపథ్యంలో మేక‌ర్స్ ఇప్పటికే ప్రమోషన్లను వేగవంతం చేశారు. ప్రమోషన్లను వేగవంతం చేశారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో, మిస్టర్ ఫర్ఫెక్ట్ అమీర్ ఖాన్ సోద‌రి నిఖితా ఖాన్ హెగ్డే ఓ కీల‌క పాత్రల్లో నటిస్తున్నారు. నిఖితా ఖాన్ ఇప్పటి వరకు సౌత్ సినిమాల్లో న‌టించింది లేదు.

Read Also:APPSC on Group-2 Mains: గ్రూప్‌-2 మెయిన్స్‌పై ఏపీపీఎస్సీ కీలక ప్రకటన..

నిఖితా ఖాన్ ఇప్పటికే పలు సినిమాల్లో నటించారు. కానీ ఆమె సౌత్ లో చేస్తున్న మొద‌టి చిత్రం ఇదే. మిషన్ మంగళ్ సినిమాతో 2019లో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నిఖిత ఎక్కువ‌గా క‌మ‌ర్షియ‌ల్ ప్రకటనల్లోనే కనిపించింది. రిల‌య‌న్స్ జువెలర్స్, హ‌ల్దీరామ్స్, యాక్సిస్ బ్యాంక్, ఫ‌స్ట్ క్రై, విప్రో యాడ్స్ ఆమెకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. అమీర్ ఖాన్ న‌టించిన ల‌గాన్ సినిమాను స్వయంగా నిఖితా ఖాన్ హెగ్డేనే నిర్మించారు. ఇక ఎల్2: ఎంపురాన్‌ విష‌యానికి వ‌స్తే ఈ సినిమాలో నిఖితా ఖాన్ హెగ్డే సుభ‌ద్ర బెన్ పాత్రలో నటిస్తున్నారు. లైకా ప్రొడ‌క్షన్స్, ఆశీర్వాద్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను సుభాస్కరన్, ఆంటోనీ నిర్మిస్తున్నారు. టొవినో థామ‌స్, మంజు వారియ‌ర్, నందు కీల‌క పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ట్రైల‌ర్ విడుదలై సినిమా పై అంచనాలను అమాంతం పెంచింది.

Read Also:Dance Icon 2 : సెకండ్ ఎపిసోడ్ నామినేషన్స్ తో హీటెక్కిన డాన్స్ ఐకాన్ సీజన్ 2 వైల్డ్ ఫైర్ షో

Exit mobile version