Site icon NTV Telugu

LSG vs RCB : ఉత్కంఠ పోరులో లక్నో ఘన విజయం

Puran

Puran

ఐపీఎల్ 2023లో సోమవారం చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్‌ఎస్‌జి) కెప్టెన్ కెఎల్ రాహుల్ టాస్ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్నారు. దీంతో.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సిబి)ని బ్యాటింగ్‌కు దిగింది. అయితే.. నిర్ణీత 20 ఓవర్లలో ఆర్‌సిబి 2 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. అయితే.. విరాట్‌ కోహ్లి 44 బంతుల్లో 61 పరుగులు సాధించారు. డుప్లెసిస్‌ 46 బంతుల్లో 79 నాటౌట్‌గా నిలిచాడు. మ్యాక్స్‌వెల్‌ 29 బంతుల్లో 59 వీర బాదుడు బాదాడు. దీంతో.. నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. అమిత్‌ మిశ్రా, మార్క్‌ వుడ్‌కు తలో వికెట్‌ను తమ ఖాతాలో వేసుకున్నారు. 96 పరుగుల స్కోర్‌ వద్ద ఆర్సీబీ తొలి వికెట్‌ కోల్పోయింది. 61 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద విరాట్‌ కోహ్లి అమిత్‌ మిశ్రా బౌలింగ్‌లో స్టోయినిస్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.

Also Read : Off The Record: జూపల్లి కృష్ణారావు దారెటు?

అయితే.. 213 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు బరిలో దిగిన లక్నో సూపర్‌ జెయింట్స్‌ వికెట్‌ తేడాతో బెంగళూరుపై ఘన విజయం సాధించారు. మొదట 213 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ 23 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన లక్నో సూపర్‌ జెయింట్స్‌.. తొలుత స్టోయినిస్‌ 30 బంతుల్లో 65 పరుగులు సాధించాడు. ఆతర్వాత పూరన్‌ 18 బంతుల్లో 62 పరుగులతో చారిత్రక ఇన్నింగ్స్‌లు ఆ జట్టు గెలుపులో ప్రధాన పాత్ర పోషించాయి. అయితే.. వీరిద్దరి సిక్సర్ల సునామీ ధాటికి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం దద్దరిల్లింది. ఇదేవిధంగా.. చివర్లో పూరన్‌ పెవిలియన్‌ చేరడంతో.. లక్నో శిబిరంలో కాస్త అలజడి మొదలైంది. అయితే.. బదోని (30) అద్భుతమైన షాట్లు ఆడి తన జట్టును గెలుపు తీరాలకు నడిపించాడు. అయితే ఇక్కడే హైడ్రామా చోటు చేసుకుంది. 19వ ఓవర్‌ నాలుగో బంతికి పార్నెల్‌ బౌలింగ్‌లో బదోని సిక్సర్‌ బాది, హిట్‌ వికెట్‌గా ఔటయ్యాడు. దీంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. లక్నో గెలుస్తుందా లేదా అన్న సందేహం మొదలైంది. అయితే చివరి బంతికి బై రావడంతో లక్నో గెలిచింది. ఫలితంగా ఆ జట్టు ఉత్కంఠ పోరులో వికెట్‌ తేడాతో విజయాన్ని ముద్దాడింది. ఇప్పటికే అగ్రస్థానంలో ఉన్న లక్నో సూపర్‌ జెయింట్స్‌.. తన స్థానాన్ని పదిలం చేసుకుంది.

Also Read : Off The Record: విశాఖ తూర్పులో ఏం జరుగుతోంది.? వైసీపీ అక్కడే ఎందుకు ఫోకస్ పెట్టింది.?

Exit mobile version