IPL 2025: అలాంటి ఆటగాళ్లను రిటైన్ చేసుకోవద్దు!
- గాయాల పాలయ్యే అవకాశం ఉన్న ఆటగాళ్లను రిటైన్ చేసుకోవద్దు
- సీజన్ మొత్తం ఆడే ప్లేయర్స్ కోసం డబ్బు వెచ్చించడానికి మొగ్గు చూపుతా
- ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన లక్నో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గాయాల పాలయ్యే అవకాశం ఉన్న ఆటగాళ్లను భారీ మొత్తాలు వెచ్చించి రిటైన్ చేసుకోకూడదని ఫ్రాంఛైజీలకు టీమిండియా మాజీ ఆటగాడు మహమ్మద్ కైఫ్ సూచించాడు. ఆటగాళ్లకు గాయాలు కావని తాను చెప్పడం లేదని, కానీ ఎక్కువగా గాయాలపాలయ్యే అవకాశమున్న ఆటగాళ్లను మాత్రం పెద్ద మొత్తం వెచ్చించి రిటైన్ చేసుకోకూడదని తన అభిప్రాయాన్ని చెప్పాడు. సీజన్ మొత్తం ఆడే ఆటగాళ్ల కోసం డబ్బు వెచ్చించడానికి తాను మొగ్గు చూపుతాను అని కైఫ్ చెప్పుకొచ్చాడు.
ఐపీఎల్ 2025లో భాగంగా సోమవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఓడిపోయింది. ఈ పరాజయంతో లక్నో ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. ఆటగాళ్ల గాయాలే తమ టీమ్ ప్లేఆఫ్స్ చేరుకోలేదని కెప్టెన్ రిషభ్ పంత్ మ్యాచ్ అనంతరం అన్నాడు. మయాంక్ యాదవ్, మోసిన్ ఖాన్ లాంటి టాప్ బౌలర్లు అందుబాటులో లేకపోవడం వల్లనే లక్నో ఓటములకు కారణం అని చెప్పుకొచ్చాడు. పంత్ వ్యాఖ్యలపై మహమ్మద్ కైఫ్ స్పందిస్తూ తన అభిప్రాయాన్ని చెప్పాడు.
Also Read
- Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
- GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
‘నేను సీజన్ మొత్తం ఆడే ప్లేయర్స్ కోసం డబ్బు వెచ్చించడానికి మొగ్గు చూపుతా. లక్నో బౌలర్లు అందరూ గాయాలతో సతమతమవుతున్నారు. ఆటగాళ్లకు గాయాలు కావని నేను చెప్పడం లేదు కానీ.. ఎక్కువగా గాయాల పాలయ్యే అవకాశమున్న ఆటగాళ్లను భారీ మొత్తం వెచ్చించి రిటైన్ చేసుకోకూడదు. వారికి వేలంలో తీసుకుంటేనే బాగుంటుంది’ అని మహమ్మద్ కైఫ్ సూచించాడు. ఇప్పటివరకు 12 మ్యాచులు ఆడిన లక్నో 5 విజయాలు మాత్రమే సాధించింది.
తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!