Site icon NTV Telugu

LSG vs RR: టాస్ నెగ్గిన రాజస్థాన్ రాయల్స్‌.. మొదట బ్యాటింగ్ చేయనున్న లక్నో..

Lsg Vs Rr

Lsg Vs Rr

ఆదివారం నాడు డబుల్ హెడ్డర్ మ్యాచ్ల నేపథ్యంలో లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకానా క్రికెట్ స్టేడియంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) యొక్క 44వ మ్యాచ్‌లో KL రాహుల్ యొక్క లక్నో సూపర్ జెయింట్స్ (LSG) సంజు శాంసన్ రాజస్థాన్ రాయల్స్‌ తో తలపడనుంది. మ్యాచ్ టాస్ లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌ టాస్ నెగ్గి లక్నో సూపర్ జెయింట్స్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఇక ఈ మ్యాచ్ లక్నో సూపర్ జెయింట్స్ కు ముఖ్యం కానుంది.

Also Read: Yuvraj Singh: అతనికి మాత్రమే ఓవర్లో ఆరు సిక్స్‌లు కొట్టగలిగేది.. యువరాజ్ కామెంట్స్..

మరోవైపు రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్ లో భీకరమైన ఫామ్ లో కొనసాగుతూ.. పాయింట్స్ పట్టికలో టాప్ ప్లేస్ లో ఉంది. ఇక నేటి మ్యాచ్లో ఈరోజు ఆటగాళ్ల వివరాలు చూస్తే.. రాజస్థాన్ రాయల్స్ లో యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్ సంజు శాంసన్ (c & wk), రోవ్‌మన్ పావెల్, షిమ్రాన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, ఆర్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్ లు ఉన్నారు.

Also Read: Crime Case: ఇదెక్కడి మాస్ మావా.. సినిమా రేంజిలో పోలీసుల స్కెచ్.. ముఠా గుట్టు రట్టు..

ఐకమరోవైపు లక్నో సూపర్ జెయింట్స్ లో KL రాహుల్ (c & wk), క్వింటన్ డి కాక్, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, దీపక్ హుడా, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, మాట్ హెన్రీ, రవి బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్, యశ్ ఠాకూర్ లు ఉన్నారు.

Exit mobile version