Site icon NTV Telugu

Virat Kohli-Anushka: విరాట్ కోహ్లీ, అనుష్క కిస్‌లు.. వీడియో వైరల్!

Virat Kohli, Anushka

Virat Kohli, Anushka

ఐపీఎల్‌ 2025లో తన చివరి లీగ్‌ మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) అద్భుత విజయం సాధించింది. లక్నో సూపర్‌ జెయింట్స్‌ నిర్ధేశించిన లక్ష్యాన్ని ఆర్సీబీ 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. జితేశ్‌ శర్మ (85 నాటౌట్‌) , విరాట్ కోహ్లీ (54)లు హాఫ్ సెంచరీలు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. అద్భుత విజయంతో పాయింట్ల పట్టికలో ఆర్‌సీబీ టాప్‌-2లోకి దూసుకెళ్లింది. ఐపీఎల్ 2025 ఫైనల్లో స్థానం కోసం క్వాలిఫయర్‌ 1లో పంజాబ్ కింగ్స్‌తో బెంగళూరు తలపడనుంది.

లక్నో సూపర్ జెయింట్స్‌పై అద్భుతమైన విజయం సాధించడం, టాప్ 2లో స్థానం దక్కడంతో ఆర్‌సీబీ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫుల్ ఖుషీ అయ్యాడు. మైదానంలో తన ఆనందాన్ని సతీమణి అనుష్క శర్మతో పంచుకున్నాడు. గ్యాలరీలో ఉన్న అనుష్కకు విరాట్ ఫ్లయింగ్‌ కిస్‌లు ఇచ్చాడు. అందుకు బదులుగా అనుష్క కూడా ఫ్లయింగ్‌ కిస్‌లు ఇచ్చారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. బెంగళూరుకు టాప్ 2లో స్థానం దక్కడంతో ఆర్‌సీబీ ఫాన్స్ కూడా ఆనందంలో మునిగిపోయారు. స్టేడియంలో ఈలలు, కేకలు వేస్తూ సందడి చేశారు.

Also Read: Jagtial Court: కానిస్టేబుల్ కండ్లుగప్పి.. రిమాండ్ ఖైదీ పరారు!

విరాట్ కోహ్లీ ఐపీఎల్‌ 2025 సీజన్‌ ఆరంభం నుంచి అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. ఇప్పటివరకు ఆడిన 14 మ్యాచులలో కోహ్లీ 600 పరుగుల మార్కును అందుకున్నాడు. ఆరెంజ్ క్యాప్ రేసులో ఐదవ స్థానంలో (602) ఉన్నాడు. గుజరాత్ టైటాన్స్ ఓపెనర్లు సాయి సుదర్శన్, శుభ్‌మాన్ గిల్ వరుసగా 679, 649 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ముంబై బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ (640) మూడవ స్థానంలో ఉన్నాడు. లక్నో ఓపెనర్ మిచెల్ మార్ష్ (627) నాల్గవ స్థానంలో కొనసాగుతున్నాడు.

Exit mobile version