ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ సహా టీ20 క్రికెట్‌లో ఓ జట్టు తరఫున 9 వేల పరుగులు చేసిన ఏకైక బ్యాటర్‌గా నిలిచాడు. ఐపీఎల్ 2025 లో భాగంగా మంగళవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసిన కోహ్లీ.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) తరఫున 9000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. కోహ్లీ 24 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద 9000 పరుగుల మార్కును చేరుకున్నాడు. ఇందులో ఐపీఎల్‌తో పాటు ఛాంపియన్స్ లీగ్‌లో ఆర్‌సీబీ తరఫున చేసిన పరుగులు ఉన్నాయి.
టీ20 క్రికెట్‌లో ఓ జట్టు తరఫున 9వేల పరుగుల మైలురాయి అందుకున్న జాబితాలో విరాట్ కోహ్లీ అగ్ర స్థానంలో ఉండగా.. రోహిత్ శర్మ రెండో స్థానంలో ఉన్నాడు. ముంబై ఇండియన్స్ తరఫున రోహిత్ 6060 రన్స్ చేశాడు. హంప్‌షైర్ తరఫున జేమ్స్ విన్స్ 5934 పరుగులు చేసి మూడో స్థానంలో ఉన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున సురేశ్ రైనా 5529 పరుగులు, ఎంఎస్ ధోనీ 5314 రన్స్ చేశారు. కోహ్లీ ఐపీఎల్ ఆరంభం నుంచి ఆర్‌సీబీకే ఆడుతున్న విషయం తెలిసిందే. రోహిత్ ముందుగా డెక్కన్ ఛార్జర్స్, ఆపై ముంబై తరఫున ఆడుతున్నాడు.
Also Read: IPL 2025 Playoffs: ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్.. క్వాలిఫయర్, ఎలిమినేటర్‌లో తలపడే టీమ్స్ ఇవే!
టీ20ల్లో ఓ జట్టు తరఫున అత్యధిక రన్స్ చేసిన బ్యాటర్స్:
# విరాట్ కోహ్లీ – 9004 – బెంగళూరు
# రోహిత్ శర్మ – 6060 – ముంబై
# జేమ్స్ విన్స్ – 5934 – హాంప్‌షైర్
# సురేష్ రైనా – 5528 – చెన్నై
# ఎంఎస్ ధోనీ – 5314 – చెన్నై
