KL Rahul: 160 ప్లస్ స్కోరు చేసిన ప్రతి మ్యాచ్‌లో విజయం సాధించడం బాగుంది: కేఎల్ రాహుల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2024లో లక్నో సూపర్ జెయింట్స్ అదరగొడుతోంది. తొలి మ్యాచ్‌లో ఓడిన లక్నో.. ఆపై హ్యాట్రిక్ విజయాలు సాధించింది. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది. ఆదివారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన పోరులో లక్నో 33 పరుగుల తేడాతో గెలిచింది. దాంతో ఐపీఎల్ చరిత్రలో తొలిసారిగా టైటాన్స్‌పై లక్నో విజయం సాధించింది. అంతేకాదు ఇప్పటివరకు 160 ప్లస్ స్కోరు చేసిన 13 మ్యాచుల్లోనూ లక్నో విజయం సాధించడం విశేషం.
గుజరాత్ టైటాన్స్‌పై విజయం అనంతరం లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ మాట్లాడుతూ ఆనందం వ్యక్తం చేశాడు. 160 ప్లస్ స్కోరు చేసిన ప్రతి మ్యాచ్‌లో విజయం సాధించడం బాగుందన్నాడు. ‘లో స్కోరును కాపాడుకోవడం చాలా ఆనందంగా ఉంది. యువ బౌలర్లతో మెరుగ్గా రాణిస్తున్నాం. ముగ్గురు స్పిన్నర్లు అదరగొట్టారు. యశ్ ఠాకూర్, కృనాల్ పాండ్యా వల్లే ఈ విజయం సాధించాం. సిద్ధార్థ్ కొత్త బంతితో బాగా బౌలింగ్ వేశాడు. రవి బిష్ణోయ్ క్యాచ్ అద్భుతం. మేం బ్యాటింగ్ చేసేటప్పుడే పిచ్ ఎలా ఉందో అర్ధమైంది. మా బౌలర్లూ పిచ్‌న బాగా ఉపయోగించుకున్నారు. 160 ప్లస్ స్కోరు చేసిన ప్రతి మ్యాచ్‌లోనూ విజయాలు సాధించడం బాగుంది. గత సీజన్‌లోనూ మేం ఇదే జట్టుతో ఆడాం. అప్పటికంటే మెరుగ్గా రాణిస్తున్నాం. ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో నెట్స్‌లో ఆటగాళ్లతో చర్చిస్తాం’ అని రాహుల్ చెప్పుకోచ్చాడు.
Also Read
- Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
- Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
- YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
- OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
Also Read: Pushpa 2 The Rule: ‘సార్’ ఏంటిది అసలు.. టీజర్ గురించి చెప్పడానికి పదాలు లేవు!
ఈ మ్యాచ్‌లో లక్నో 33 పరుగుల తేడాతో గుజరాత్‌పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 163 పరుగులు చేసింది. స్టాయినిస్ (58; 43 బంతుల్లో 4×4, 2×6), పూరన్ (32 నాటౌట్; 22 బంతుల్లో 3×6) చెలరేగారు. గుజరాత్ బౌలర్లలో ఉమేశ్ యాదవ్ (2/22), దర్శన్ నాల్కండే (2/22) రాణించారు. చేధనలో గుజరాత్ 18.5 ఓవర్లలో 130 పరుగులకు ఆలౌట్ అయింది. సాయి సుదర్శన్ (31; 23 బంతుల్లో 4×4) టాప్ స్కోరర్. లక్నో పేసర్ యశ్ ఠాకూర్ (5/30) ఇది వికెట్స్ పడగొట్టాడు.
తాజావార్తలు
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
-
CM Revanth Reddy : ఆక్స్‌ఫర్డ్‌కు రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్‌లో కొత్త క్యాంపస్.?
-
Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
-
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
-
OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!