Site icon NTV Telugu

Digvesh Rathi: సంచలనం.. 5 బంతుల్లో 5 వికెట్లు తీసిన LSG స్పిన్నర్.. వీడియో వైరల్

Digvesh Rathi

Digvesh Rathi

Digvesh Rathi: ఐపీఎల్ 2025 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆకట్టుకున్న లెగ్ స్పిన్నర్ దిగ్వేష్ రాఠి మరోసారి వార్తల్లోకెక్కాడు. ఓ లోకల్ టీ20 లీగ్ మ్యాచ్‌లో వరుసగా 5 బంతుల్లో 5 వికెట్లు తీసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. ఈ అద్భుత ఘనతకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. స్పిన్నర్ అయిన రాఠి మ్యాచ్‌లో తన స్పిన్ మాయతో బ్యాటర్లను పూర్తిగా ముప్పతిప్పలు పెట్టాడు. వరుసగా ఐదు డెలివరీలలో ఐదు వికెట్లు తీసి రేర్ ఫీట్ నమోదు చేశాడు. దిగ్వేష్ రాఠి ఐపీఎల్ 2025లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున 13 మ్యాచ్‌లలో 14 వికెట్లు తీసి మంచి ప్రదర్శన కనబర్చాడు.

Read Also: Rapido Rider: ర్యాపిడో రైడర్ దౌర్జన్యం.. మహిళా ప్రయాణికురాలిపై చెంపదెబ్బ.. వీడియో వైరల్

అయితే అతని ఆటతీరు కన్నా ఎక్కువగా చర్చకు వచ్చిన అంశం అతని ‘నోట్‌బుక్ సెలబ్రేషన్’. వికెట్ తీసిన ప్రతిసారీ అతను ఊహించదగిన సెలబ్రేషన్ చేస్తుండటంతో, పలుమార్లు జరిమానాలు కూడా చెల్లించాల్సి వచ్చింది. అయినా రాఠి తన పద్ధతిని మార్చకుండా ఆట పట్ల తన ఉద్వేగాన్ని ప్రదర్శిస్తూ అభిమానులను అలరించాడు. అయితే, భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్‌రాజ్ సింగ్ రాథి చేస్తున్న సెలబ్రేషన్‌ను సమర్థించారు. ఆయన ఇటీవలి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇలా జరిమానాలు వేయడం ఏంటి? ఇది చిన్నపాటి విషయం. మైదానంలో ఎమోషన్స్ కాస్త ఎక్కువ అవుతాయి. ఆటగాళ్లు చివరికి మిత్రులే. ఒక్క సారీ చెప్పగలిగితే సరిపోతుంది. ఇలా చిన్న చిన్న విషయాల్ని పెద్దవిగా తీసుకోవద్దని అన్నారు.

Read Also: Suhas: అంబాజీపేట హీరోయిన్ తో మరో సినిమా

Exit mobile version