NTV Telugu Site icon

MS Dhoni: ఎంఎస్ ధోనీ లాంటి నాయకుడిని ఎప్పుడూ చూడలేదు: ఐపీఎల్ యజమాని

The Goat Ms Dhoni

The Goat Ms Dhoni

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి కేవలం ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతున్న మహీకి ఏమాత్రం ఫ్యాన్‌బేస్ తగ్గలేదు. భారత ఫాన్స్ మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ధోనీని అభిమానిస్తారు. ఫాన్స్ మాత్రమే కాదు.. ఐపీఎల్‌ యజమానులు కూడా మిస్టర్‌ కూల్‌ను గౌరవిస్తారు. మహీని లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా అభిమానిస్తారు. ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న గోయెంకా.. ధోనీపై ప్రశంసల వర్షం కురిపించాడు.

తాను ఎంఎస్ ధోనీతో మాట్లాడిన ప్రతిసారీ ఏదోఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటానని సంజీవ్ గోయెంకా తెలిపారు. ‘ఎంఎస్ ధోనీ లాంటి నాయకుడిని ఎప్పుడూ చూడలేదు. ధోనీ ఆలోచనా విధానం, ప్రవర్తించే తీరు.. తన వయసులో ఉన్న వ్యక్తి తనను తాను ఎలా ఆవిష్కరించుకుంటాడో తెలియజేస్తుంది. శ్రీలంక యువ బౌలర్‌ మతిశా పతిరనను డేంజరస్‌ మ్యాచ్‌ విన్నర్‌గా తీర్చిదిద్దాడు. మహీ ఎందరో ఆటగాళ్లను వెలుగులోకి తెచ్చాడు. మైదానంలో కీలక సూచనలు చేస్తాడు. ఆటగాళ్లను ఎప్పుడు, ఎలా ఉపయోగించుకోవాలో అతనికి బాగా తెలుసు. పరిస్థితులను హ్యాండిల్ చేయడంలో దిట్ట. నేను అతడితో మాట్లాడినప్పుడల్లా ఏదోఒక కొత్త విషయం నేర్చుకుంటా’ అని గోయెంకా చెప్పారు.

Also Read: Siddharth-Allu Arjun: అల్లు అర్జున్‌తో ఏదైనా సమస్యా?.. సిద్ధార్థ్‌ సమాధానం ఇదే!

తన మనవడు, ఎంఎస్ ధోనీల మధ్య సంభాషణ గురించి కూడా సంజీవ్ గోయెంకా తెలిపారు. ‘నా మనవడికి క్రికెట్‌ అంటే చాలా ఇష్టం. కాదు కాదు పిచ్చి. ఒకసారి ఐపీఎల్ మ్యాచ్‌ సందర్భంగా ఎంఎస్ ధోనీతో నేను మాట్లాడాను. అప్పుడు నా మనవడు నాతోనే ఉన్నాడు. ధోనీని అనేక ప్రశ్నలు అడగాడు. ఇక చాలు అని నా మనవడిని అంటే.. మీరు ఆగండి, నేను ఈ సంభాషణను ఆస్వాదిస్తున్నా అని ధోనీ నాతో చెప్పాడు. కాసేపు నా మనవడితో మాట్లాడాడు’ అని గోయెంకా చెప్పుకొచ్చారు. ఐపీఎల్ 2025లో మహీ ఆడుతున్న విషయం తెలిసిందే. ఐపీఎల్‌ 2025 మెగా వేలం ముందు ముందు ధోనీని చెన్నై సూపర్ కింగ్స్ రూ.4 కోట్లకు రిటైన్‌ చేసుకుంది. వచ్చే ఏడాదికి అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి ఐదేళ్లు కానున్న నేపథ్యంలో ధోనీని అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌గా తీసుకుంది.

Show comments