Site icon NTV Telugu

Congress: సాయంత్రం హైదరాబాద్ అభ్యర్థి ప్రకటన.. రేసులో ఎవరున్నారంటే..!

Dke

Dke

వచ్చే వారమే తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. కానీ ఇప్పటి వరకూ మూడు స్థానాలకు మాత్రం అభ్యర్థుల్ని ఇంకా ఖరారు చేయలేదు. దీనిపై గత కొంతకాలంగా తీవ్ర కసరత్తు చేస్తోంది. శనివారం సాయంత్రం దీనిపై కాంగ్రెస్ సీఈసీ ఒక క్లారిటీ ఇవ్వనుంది. మొత్తం 17 స్థానాలకు గానూ.. ఇప్పటి వరకు 14 స్థానాల్లో అభ్యర్థుల్ని వెల్లడించింది. ఇక హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం స్థానాలు పెండింగ్‌లో ఉన్నాయి. సాయంత్రం మాత్రం హైదరాబాద్‌ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.

 

ఇదిలా ఉంటే హైదరాబాద్‌ స్థానం ఎంఐఎంకు కంచుకోట. మళ్లీ మజ్లిస్ నుంచి అసదుద్దీన్ బరిలో ఉన్నారు. ఇదిలా ఉంటే ఈసారి ఎలాగైనా గెలవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. ఇక్కడ మాధవిలతను బీజేపీ పోటీలోకి దింపింది. ఇక బీఆర్ఎస్ నుంచి గడ్డం శ్రీనివాస్ యాదవ్ ( బీసీ) బరిలో దింపారు. కాంగ్రెస్ కూడా బలమైన అభ్యర్థిని నిలబెట్టాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో టెన్నిస్ స్టార్ సానియా మిర్జాను బరిలోకి దింపాలని కాంగ్రెస్ చూస్తోంది. ఈమె పేరు దాదాపు ఖరారైనట్లు సమాచారం. ఇక ఖమ్మంలో గట్టి పోటీ నెలకొంది. ఇక్కడ మంత్రుల బంధువులు బరిలోకి వచ్చారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు, తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు పోటీ పడుతున్నారు. అలాగే మరో వ్యక్తి పేరు కూడా వినిపిస్తోంది. ఇక కరీంనగర్ సీటుపై కూడా తీవ్ర కసరత్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: BJP: బీజేపీ మేనిఫెస్టో విడుదలకు ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే..!

ఇక దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరగనుంది. తెలంగాణలో మే 13న పోలింగ్ జరగనుంది. తొలి విడత ఏప్రిల్ 19న ప్రారంభం కాగా.. ఏప్రిల్ 26న సెకండ్ విడత జరగనుంది. మే 7, 13, 20, 25, జూన్ 1న పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఈసారి 400కు పైగా సీట్లు సాధిస్తామని ప్రధాని మోడీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇండియా కూటమి కూడా జూన్ 4న విక్టరీ సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తోంది. మరీ ఏం జరుగుతుందో వేచి చూడాలి.

 

ఇది కూడా చదవండి: Pakistan : పాకిస్థాన్ లోని బలూచిస్థాన్ లో ఉగ్రవాదుల దాడి.. 11మంది మృతి

Exit mobile version