Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Lpg Cylinder Shortage Hits Hotels In Kakinada Hotel Associations Warn Of Possible Shutdown

LPG Cylinder Shortage: రేపు సాయంత్రం వరకే గ్యాస్‌ సిలిండర్లు ఉన్నాయి.. ఎల్లుండి నుంచి పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు..!

Published Date :March 11, 2026 , 5:16 pm
By Sudhakar Ravula
LPG Cylinder Shortage: రేపు సాయంత్రం వరకే గ్యాస్‌ సిలిండర్లు ఉన్నాయి.. ఎల్లుండి నుంచి పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

LPG Cylinder Shortage: యుద్ధ ప్రభావం గ్యాస్‌ను తాకింది.. ఇప్పటికే కొన్ని దేశాల్లో పెట్రో, గ్యాస్‌ ధరలు భగ్గుమంటున్నాయి.. భారత్‌లోనూ కమర్షియల్‌తో పాటు వంట గ్యాస్‌ ధరలను కూడా పెంచేశారు.. ఇక, వంట గ్యాస్‌కు ప్రాధాన్యత ఇస్తూనే.. కమర్షియల్‌ గ్యాస్‌కు కోత పెడుతున్నారు.. దీంతో, ఇప్పటికే పలు సిటీల్లో హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడే పరిస్థితి వచ్చింది.. ఆంధ్రప్రదేశ్‌లోనూ కొన్ని ప్రాంతాలకు గ్యాస్‌ కొరత ఎఫెక్ట్‌ తాకింది.. ఇక, కాకినాడలో గ్యాస్ సిలిండర్ల కొరతపై హోటల్ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని హోటల్స్ మరియు స్టార్ హోటల్స్ వద్ద ప్రస్తుతం ఉన్న గ్యాస్ సిలిండర్లు రేపు సాయంత్రం వరకు మాత్రమే సరిపోతాయని హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు.

రేపటి తర్వాత పరిస్థితి అనిశ్చితం
హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఎన్టీవీతో మాట్లాడుతూ, ఎల్లుండి నుంచి గ్యాస్ సిలిండర్ల పరిస్థితి ఎలా ఉంటుందో తమకు స్పష్టంగా తెలియడం లేదన్నారు. ఒకవైపు మంత్రి గ్యాస్ సిలిండర్ల కొరత లేదని చెబుతున్నప్పటికీ, మరోవైపు ఏజెన్సీలు మాత్రం ఎమ్మార్వోలు గ్యాస్ సిలిండర్లు ఇవ్వొద్దని చెప్పారని తమకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. గ్యాస్ సరఫరా నిలిచిపోతే హోటల్స్ నిర్వహించడం చాలా కష్టమవుతుందని యజమానులు అంటున్నారు. అవసరమైతే కట్టెల పొయ్యులు, పుల్లలు ఉపయోగించి హోటల్స్ నడపాల్సిన పరిస్థితి కూడా రావచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పెళ్లిళ్ల సీజన్‌లో క్యాటరింగ్ ఇబ్బందులు
ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో చాలా క్యాటరింగ్ ఆర్డర్లు ఇప్పటికే తీసుకున్నామని హోటల్ యజమానులు తెలిపారు. గ్యాస్ సిలిండర్లు అందుబాటులో లేకపోతే ఆ ఆర్డర్లను ఎలా నిర్వహించాలో అర్థం కావడం లేదని చెప్పారు. ఇదే పరిస్థితి కొనసాగితే మొదట హాఫ్ డే మాత్రమే హోటల్స్ నడపాల్సి వస్తుందని, పరిస్థితి మారకపోతే చివరికి హోటల్ ఇండస్ట్రీ పూర్తిగా మూసివేయాల్సి వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. హాస్పిటల్స్ మరియు హాస్టల్స్‌కు మినహాయింపులు ఇచ్చినట్లే హోటల్స్‌కు కూడా గ్యాస్ సరఫరాలో మినహాయింపు ఇవ్వాలని హోటల్స్ అసోసియేషన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తోంది..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh hotel industry news
  • AP LPG cylinder supply news.
  • catering business gas shortage
  • hotel association warning
  • Kakinada hotels crisis

తాజావార్తలు

  • CM Chandrababu Letter: వైఎస్‌ జగన్‌ సహా అన్ని పార్టీల అధ్యక్షులకు సీఎం చంద్రబాబు లేఖ.. ‘నారీ శక్తి వందన్’కు మద్దతివ్వండి..

  • Rohit Sharma Injury Update: ముంబై ఇండియన్స్‌కు షాక్.. రోహిత్ శర్మ అవుట్!

  • Cucumber Sandwich Recipe: వేసవిలో బెస్ట్ బ్రేక్ ఫాస్ట్.. 5 నిమిషాల్లో మీ పిల్లల లంచ్ బాక్స్‌ రెడీ..

  • US-Iran Talks: అమెరికాతో తదుపరి చర్చలపై ఇరాన్ కీలక ప్రకటన!

  • Land Dispute Turns Violent: స్థల వివాదం.. ఐదుగురు మహిళలపై విచక్షణారహితంగా దాడి..

ట్రెండింగ్‌

  • ఒక్కసారి ఛార్జ్ చేస్తే 320 కి.మీ రేంజ్​.. OLA ‘S1 X+’ లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, Snapdragon 7s Gen 4, భారీ 6500mAh బ్యాటరీతో Infinix NOTE 60 Pro లాంచ్.. ధర ఎంతంటే?

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • Super Juice: వేసవి వేడికి ఈ పండు రసమే ‘రామబాణం’.. బరువు తగ్గడమే కాదు, ముఖం కూడా మెరిసిపోతుంది.!

  • అమృతం ఎక్కడో లేదు.. మీ వంటింట్లోనే ఉంది..! వేసవిలో ఈ ఒక్క గ్లాసు పానీయం చేసే మ్యాజిక్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions