Site icon NTV Telugu

Weather Updates: రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలకు భారీ వర్ష సూచన!

Telangana Rains

Telangana Rains

AP and Telangana Weather Forecast: ఏపీ, యానాంలో నైరుతి దిశగా బలమైన గాలులు వీస్తున్నాయి. ఈ క్రమంలోనే బుధవారం (జూన్ 26) బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతా­వరణ నిపుణులు అంటున్నారు. ఈ అల్పపీడనం బలపడుతూ.. ఉత్తర దిశగా ప్రయాణించే అవకాశం ఉంది. అదే రోజున అల్పపీడనం ఏపీ తీరాన్ని తాకనుంది. ఈ అల్పపీడనం ప్రభావంతో బుధవారం సాయంత్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మోస్తరు వర్షాలు కురవన్నాయి.

అల్పపీడనం ప్రభావంతో ముఖ్యంగా ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో ముసురు వాతావరణం ఏర్పడనుంది. బుధవారం ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు కోస్తా జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతా­వరణ శాఖ అధికారులు తెలిపారు. జూన్ 27, 28 తేదీల్లో పలు చోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. తెలంగాణ ప్రాంతంలో పశ్చిమం, నైరుతి నుంచి గాలులు వీస్తున్నాయి. దాంతో రానున్న 2-3 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. రానున్న ఐదు రోజులు వాతావరణం మేఘావృతమై.. మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతా­వరణశాఖ తెలిపింది.

Exit mobile version