NTV Telugu Site icon

Weather: నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం.. 5 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు!

Weather Update

Weather Update

Weather Forecast: నేడు నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. తమిళనాడు పరిసరి ప్రాంతంలో ఆరించి ఉన్న ఉపరితల ఆవర్తన కారణంగా బుధవారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడునున్నట్లు తెలిపింది. 24 గంటల్లో వాయుగుండంగా అల్పపీడనం.. ఈశాన్య దిశగా కదులుతూ శుక్రవారం ఉదయానికి అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉంది. నైరుతి బంగాళాఖాతానికి ఆనుకుని తమిళనాడు పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కారణంగా అల్పపీడనం ఏర్పడనుంది. ఈ నేపథ్యంలో 5 రోజుల పాటు ఏపీ, తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.

Read Also: Arogya Sri: ఏపీలో నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్!

బుధవారం ఏపీలోని విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. అల్పపీడనం ఏర్పడిన తర్వాత పొడి వాతావరణం కారణంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉత్తర కోస్తాలో ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు కొన్ని చోట్ల 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో కూడా వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రాయలసీమలోనూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు కొన్ని చోట్ల 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో కూడా వీచే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.