NTV Telugu Site icon

Weather Update: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో వర్షాలు

Weather

Weather

Weather Update: ఏపీలో భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాలకు సమీపంలో అల్పపీడనం ఏర్పడింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఆనుకుని అల్పపీడనం బలపడుతోంది. ఇది రాబోయే 2 రోజుల్లో ఈశాన్య దిశగా కదులుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. శుక్రవారం ఉదయానికి వాయుగుండంగా, ఈశాన్య దిశగా కదులుతూ శనివారం సాయంత్రానికి తుఫాన్‌గా బలపడే అవకాశం ఉందని అంటున్నారు. తుఫాన్ ఏర్పడితే రెమాల్‌గా నామకరణం చేసే అవకాశం ఉంది. తుఫాన్‌ ఒడిశా, పశ్చిమ బెంగాల్ వైపు పయనించే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఏపీపై తుఫాన్ ప్రభావం తక్కువగానే ఉంటుందని ఐఎండీ వెల్లడించింది. మత్యకారులు, నావికులకు హెచ్చరికలు జారీ చేసింది. సముద్రం అల్లకల్లోలంగా మారుతున్నందున అప్రమత్తంగా వుండాలని సూచించింది.

Read Also: Ibrahim Raisi : ఆ 1.30 సెకన్లలోనే రైసీ మృతి మిస్టరీ దాగి ఉంది.. అనుమానం నిజమేనా?

తుఫాన్‌ ప్రభావం రాష్ట్రంపై పెద్దగా ఉండబోదని.. ఒడిశాతో పాటు పశ్చిమ బెంగాల్‌లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అల్పపీడనం ప్రభావంతో ఏపీవ్యాప్తంగా గురు, శుక్రవారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అల్పపీడనం ప్రభావంతో నేడు పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్‌, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లా్ల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు నైరుతి రుతుపవనాలు అరేబియా సముద్రం, మాల్దీవులు, కొమరిన్‌, అండమాన్‌ నికోబార్‌ దీవులు, దక్షిణ బంగాళాఖాతం కొన్ని ప్రాంతాలకు విస్తరించాయని చెబుతున్నారు. ఈ నెల 30న కేరళలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని, ఏపీలోకి జూన్‌ మొదటివారంలో విస్తరిస్తాయని అంటున్నారు.