NTV Telugu Site icon

Netflix : చౌక ప్లాన్లపై నెట్‌ఫ్లిక్స్‌ కసరత్తు..

Netflix Ott

Netflix Ott

కరోనా పుణ్యమా అని ఓటీటీలకు డిమాండ్‌ పెరిగింది. అయితే.. ప్రస్తుతం ఓటీటీలు ఓ రేంజ్‌లో దూసుకుపోతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో కొన్ని కొన్ని ఓటీటీ ఫ్లాట్‌ఫాంలు వినియోగదారులను ఆకర్షించేందుకు కొత్త కొత్త ప్లాన్లను ప్రవేశపెడుతున్నాయి. అయితే.. ఈ క్రమంలో ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ వినియోగదారులను పెంచుకునే పనిలో పడింది. ఇప్పటికే ఈ ఏడాది మొదటి నుంచి 10లక్షలకుపైగా సబ్‌స్ర్కైబర్స్‌ నెట్‌ఫ్లిక్స్‌ను వీడివెళ్లారు. అయితే.. తిరిగి వినియోగదారులను సంపాదించుకునేందుకు చౌక ప్లాన్లను ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తోంది నెట్‌ఫ్లిక్స్‌.. అయితే.. ఈ సంవత్సరం మొదటి మూడు నెలల్లో 2 లక్షల మంది వినియోదారులు నెట్‌ఫ్లిక్స్‌ను వీడగా.. ఏప్రిల్‌-జూన్‌ నెలలో 9.7 లక్షల మంది నెట్‌ఫ్లిక్స్‌ను వదిలెళ్లారు.

అయితే.. ఈ నేపథ్యంలో వినియోగదారులను పెంచుకునేందుకు యాడ్స్‌తో కూడిన చౌక ప్లాన్లను తీసుకువచ్చే యోచనలో నెట్‌ఫ్లిక్స్‌ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్లాన్లలో ఆప్‌లైన్‌లో వీడియోలు వీక్షించే సదుపాయం ఉండదు. అంతేకాకుండా.. సినిమాలు, షోలు యాప్‌లోకి డౌన్‌లోడ్‌ చేసుకునే వీలు ఉండదు. దీనిపై ఇంకా నెట్‌ఫ్లిక్స్‌ ఎలాంటి అధికారక ప్రకటన చేయలేదు. పూర్తిస్థాయిలో ఈ ప్లాన్లపై స్పష్టత వచ్చిన తరువాత అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.