NTV Telugu Site icon

Viral Video : మరీ ఇంత పిచ్చా.. ఎక్కువైతే ఇంతే మరి..

viral news

viral news

సోషల్ మీడియాలో క్రేజ్ కోసం ఎన్నెన్నో జిమ్మిక్కులు చేస్తారు.. యూత్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. లైకుల కోసం ప్రాణాలను పణంగా పెడుతున్నారు.. మరికొంతమంది ఏకంగా ప్రాణాలను వదిలేస్తున్నారు.. కొన్ని సార్లు వారిని కని, పెంచి, పెద్దవాళ్ళని చేసిన తల్లిదండ్రులని కూడా మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. లవ్ లో ఉన్నామనగానే సినిమా హీరోల్లాగా ఫీల్ అయిపోతున్నారు. దానికితోడు సోషల్ మీడియా తోడు ఒకటి తయారయ్యింది తాజాగా లవర్స్ కాస్త క్రేజీగా ఉండాలని ఆలోచించారు.. చివరికి నడ్డి విరగొట్టుకున్నారు.. ఇందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

ఇకపోతే ప్రేమ మత్తులో వున్న యువతీ యువకులకు అయితే ఏం చేస్తున్నామో కూడా సోయిలేనంతగా బైక్ పై ప్రేమ ప్రయోగాలు చేస్తున్నారు. అవును, సోషల్ మీడియా వచ్చాక లైక్ లు, కామెంట్ల కోసం ప్రమాదకర స్టంట్స్ ను ప్రేమికులు చూస్తున్నారు. సోషల్ మీడియా లో పాపులారిటీ కోసం ప్రాణాల మీదకు కొని తెచ్చుకుటుంబున్నారు. తాజాగా ఓ ఇద్దరు ప్రేమికులు బైక్ స్టంట్ చేసేశారు..లవ్ సింబల్ చూపిస్తూ బైక్ ను లేపాలనుకున్నారు. అయితే కంట్రోల్ తప్పి పోయి బైక్ వెనుకకు జారి ఇద్దరు ప్రేమికులు కింద బోక్కబోర్లా పడిపోయారు. అదృష్టం ఏంటంటే బండి వీరి మీద పడకుండా కాస్త దూరం జరిగింది. లేకుంటే వీరిద్దరి ప్రాణాలు గాల్లో కలిసేవి..

తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తాజాగా ఆ వీడియోను షేర్ చేస్తూ… యువతీయువకులారా.. సోషల్ మీడియా మత్తులో పడి బంగారు భవిష్యత్ ను నాశనం చేసుకోకండి. లైక్ లు, కామెంట్ల కోసం ప్రమాదకర స్టంట్స్ అసలే చేయకండి. ఇలాంటి పిచ్చి పనులు చేసేటప్పుడు మీ కుటుంబ సభ్యుల గురించి ఒకసారి ఆలోచించండి. సోషల్ మీడియా లో పాపులారిటీ కోసం ప్రాణాల మీదకు తెచ్చుకోకండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులను మనో వేదనకు గురిచేయకండి.. అంటూ కొటేషన్ రాసుకొచ్చారు.. ప్రస్తుతం ఆ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..