మానవ సంబంధాలు మారిపోతున్నాయి… ప్రేమ కోసం ఇంట్లోవారినే మోసం చేయడానికి వెనుకాడడం లేదు. తాజాగా చెన్నైలో ఓ అన్న ప్రియురాలి కోసం స్వయంగా తమ్ముడినే మోసం చేశాడు. ప్రియురాలి గోవాకు వెళ్ళాలని అందిట. ఆమెను తీసికెళ్ళడానికి ఏకంగా కారు కొనాలని భావించాడు. అందుకు ఏం చేయాలో తోచక తన తమ్ముడి దగ్గర దొంగతనం చేశాడు.
Mudragada Padmanabham:కోనసీమ పెద్దలకు ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ
అన్న దొంగా!
కారు కొనేందుకు తమ్ముడికి చెందిన 550 గ్రాముల బంగారం దొంగిలించాడు. దానిని అమ్మేసి ప్రియురాలు స్వాతి కోసం కారు కొన్నాడు అన్న శేఖర్. చెన్నై పూనమలేలో జరిగిన ఘటన సంచలనంగా మారింది. మిగిలిన నగలు అమ్మి గోవా వెళ్ళే టైంలో తమ్ముడికి దొరికి పోయాడు అన్న శేఖర్. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు తమ్ముడు. అన్న శేఖర్,ప్రియురాలు స్వాతిపై కేసు నమోదు చేసి ఇద్దరిని అరెస్టు చేశారు. ప్రియురాలి కోసం ప్రియుడు ఏదైనా చేస్తాడనడానికి ఈ దొంగతనమే నిదర్శనం అని నెట్లో కామెంట్లు పడుతున్నాయి.
Election Commission: వారికి షాకిచ్చిన ఎన్నికల కమిషన్.. కోటి మంది ఓట్లు తొలగింపు..!