NTV Telugu Site icon

Paris Olympics 2024: ఒలింపిక్స్‌లో లవ్ ప్రపోజల్.. వీడియో వైరల్

Olampics Love Proposal

Olampics Love Proposal

పారిస్ ఒలింపిక్స్ లో అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది. శుక్రవారం జరిగిన పారిస్ ఒలింపిక్స్‌లో చైనా బ్యాడ్మింటన్ క్రీడాకారిణి హువాంగ్ యా కియోంగ్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. అయితే, తన ఆనందం దానికే పరిమితం కాలేదు. స్వర్ణం గెలిచిన వెంటనే తోటి ఆటగాడు ఆమెకు ప్రపోజ్ చేశాడు. డబుల్స్ ప్లేయర్ యుచెన్ మెకాళ్లపై కూర్చుని ఉంగరంతో ఆమెకు లవ్ ప్రపోజ్ చేశాడు. దీంతో.. హువాంగ్ ఆశ్చర్యం, ఆనందంతో ఓకే చెప్పింది. పారిస్ ఒలింపిక్స్‌లో లవ్ ప్రపోజల్ ఇదే తొలిసారి. కాగా.. ఈ క్యూట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read Also: IAS officers Transferred: తెలంగాణలో ఐఏఎస్‌ అధికారుల బదిలీలు.. ఈ సారి ఎంతమందంటే..

హువాంగ్, జెంగ్ సి వీతో కలిసి మిక్స్‌డ్ డబుల్స్ ఈవెంట్‌లో 21-8 21-11తో దక్షిణ కొరియాకు చెందిన కిమ్ వాన్ హో.. జియోంగ్ నా యున్‌లను ఓడించి స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. మెడలో బంగారు పతకాన్ని ధరించి, చైనాకు చెందిన మరో బ్యాడ్మింటన్ సహచరుడు లి యుచెన్‌ను కలవడానికి వచ్చింది. లి మొదట ఆమెకు ఒక పుష్పగుచ్ఛాన్ని ఇచ్చి.. ఆ తర్వాత మోకాళ్లపై కూర్చుని హువాంగ్‌కు ప్రపోజ్ చేశాడు. ఇది చూసిన హువాంగ్ ఆశ్చర్యం, ఆనందానికి గురై ఓకే చెప్పేసింది. అనంతరం హువాంగ్ మాట్లాడుతూ.. పారిస్‌లో ఎంగేజ్మెంట్ రింగు తాను ఆశించడం లేదని.. ఆటలకు సన్నద్ధం కావడంపై పూర్తిగా దృష్టి సారించానని తెలిపింది.

Read Also: Children’s Memory: పిల్లల జ్ఞాపకశక్తిని పెంచే అద్భుత చిట్కాలు..

యుచెన్, అతని డబుల్స్ భాగస్వామి Ou Xuan Yi పురుషుల డబుల్స్ ఈవెంట్‌లో పోటీ పడ్డారు. టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేతలు యుచెన్, జువాన్ డ్రా తర్వాత గ్రూప్ దశ నుండి నిష్క్రమించడంలో విఫలమయ్యారు. హువాం, జెంగ్ సి వీ పారిస్ గేమ్స్‌లో బ్యాడ్మింటన్‌లో తొలి బంగారు పతకాన్ని సాధించారు. వారు కిమ్ వాన్ హో.. జియోంగ్ నా యూన్‌లపై ప్రారంభం నుండి చివరి వరకు ఆధిపత్యం చెలాయించారు. కొరియా జోడీని 21-8, 21-11తో ఓడించేందుకు కేవలం 41 నిమిషాలకే పట్టింది.

 

Show comments