NTV Telugu Site icon

Odisha Train Accident: మరుభూమిలో ప్రేమ కవితలు… రైలు ట్రాక్‌ పై డైరీలు

Odisha Train Accident

Odisha Train Accident

Odisha Train Accident: ప్రమాదం చిన్నదైనా పెద్దదైనా కచ్చితంగా కొన్ని కథలను మిగుల్చుతుంది. ఒడిశాలోని బాలాసోర్ రైలు ప్రమాదంలో కూడా అలాంటిదే కనిపించింది. ప్రమాదం తర్వాత ఎక్కడ చూసినా ప్రయాణికుల మృతదేహాలు కుప్పలుగా కనిపిస్తున్నాయి. ఏడుస్తున్న ప్రయాణీకుల కళ్లు తమ ప్రజలను చూడాలని తహతహలాడుతున్నాయి. ఇక లోకాన్ని చూడలేక అమాయకులైన ప్రయాణికులు శాశ్వతంగా సైలెంట్ అయిపోయారు. ఈ క్రమంలోనే ట్రాక్‌లపై పడి ఉన్న కొన్ని పేజీలు, స్కెచ్‌లు ప్రజల దృష్టిని ఆకర్షించాయి.

Read Also:Maharashtra : ఘోర రోడ్డు ప్రమాదం..బస్సును ఢీ కొట్టిన కారు.. ఐదుగురు మృతి..

డైరీలో కవితలు వ్రాసిన చాలా పేజీలు ట్రాక్‌లపై పడి ఉన్నాయి. ఈ పద్యాలు బెంగాలీ భాషలో ఉన్నాయి.పూవులు, ఏనుగు, చేప బొమ్మలు, అంతా సహజత్వం పెనవేసుకున్న డైరీ విప్పుకుని కనిపించింది. బెంగాలీ భాషలో రాసిన ప్రేమ కవితలు అందులో నిక్షిప్తమై ఉన్నాయి. ‘చెదురుమదురుగా కనిపించే మేఘాలు సన్నటి వర్షాన్ని కురిపిస్తాయి. మనం వినే చిట్టి కథలే మనలో ప్రేమను వికసింపజేస్తాయి’ అంటూ స్వదస్తూరితో రాసిన కవిత చదివిన వారి గుండెను పిండేస్తుంది. ‘ప్రేమవై నీవు నాకు ఎల్లప్పుడూ కావాలి, నా మనసులో నీవెప్పుడూ ఉంటావు’ అంటూ మరో కవిత ఉన్నది. ఈ డైరీ ఫొటోలు సోషల్ మీడియాకు ఎక్కాయి. జీవితం ఎంత చంచలమైందో కదా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Read Also:NTR: దేవర టైటిల్ కి ఏజెంట్ పాత్రకి అసలు సంబంధం ఉందా బాసూ?

ఎవరి డైరీ? ఎవ్వరికి తెలియదు
ఈ కవితలు ఎవరు రాశారు, ఎవరి డైరీ యాత్రికుడికి సంబంధించినది అనే సమాచారం ఇంకా తెరపైకి రాలేదు. అంతేకాక ఇప్పటివరకు ఎవరూ వాటికోసం అడగలేదు. ఒక వేళ అడిగితే అప్పుడు ఇచ్చేందుకు పోలీసు అధికారులు పేజీలను భద్రపరిచారు. ఇలాంటి అనేక ఇతర విషయాలు తమలో తాము కథను చెప్పుకునే ట్రాక్‌లపై పడి ఉన్నాయి. ఒడిశాలోని బాలాసోర్‌లో శుక్రవారం జరిగిన రైలు ప్రమాదంలో 275 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా, 1000 మందికి పైగా గాయపడ్డారు. వేగంగా వెళ్తున్న కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడంతో దాని బోగీలు లూప్ లైన్‌పై నిలబడి ఉన్న గూడ్స్ రైలును ఢీకొనడంతో, రైలు వెనుక భాగం అటుగా వెళ్తున్న యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.