Site icon NTV Telugu

Love Mouli: మొదటిసారి వరంగల్ నుంచి స్టార్ట్ చేసిన ‘లవ్ మౌళి’ ప్రమోషన్స్..!

10

10

టాలీవుడ్ లో టాలెంటెడ్ యాక్టర్ నవదీప్ కాస్త విరామం తర్వాత హీరోగా, న‌వ‌దీప్ 2.O గా క‌నిపించ‌బోతున్న చిత్రం ‘లవ్,మౌళి’. విభిన్న‌మైన, వైవిధ్య‌మైన పాత్రలో నవదీప్ ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. ఈ చిత్రానికి అవ‌నీంద్ర ద‌ర్శ‌కుడు. ఈ చిత్రాన్ని నైరా క్రియేషన్స్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్‌‌ తో క‌లిసి.. టాలీవుడ్ టాలెంటెడ్ టెక్నీషియన్స్‌ కి అడ్డాగా మారిన ‘సి స్పేస్’ నిర్మిస్తోంది. ఇకపోతే ఈ సినిమాని ఏప్రిల్ 19న విడుద‌ల చేయబోతున్నట్లుగా చిత్రయూనిట్ ఇదివరకే ప్ర‌క‌టించింది.

Also Read: BRS: కంటోన్మెంట్ ఉపఎన్నిక బీఆర్ఎస్ అభ్యర్థిగా నివేదిత..

ఇక ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి చిత్ర బృందం మూవీ ప్రమోషన్స్ చేస్తున్నట్లు అర్ధమవుతుంది. ఇందుకు సంబంధించి నేడు వరంగల్ లోని ఎన్ఐటి కళాశాలలో ప్రమోషన్స్ చేసారు. ఈ కార్యక్రమంలో హీరో నవదీప్ మాట్లాడుతూ.. ఈరోజు ఎన్ఐటి కళాశాలకు వచ్చాను.. స్టూడెంట్స్ తో ఇంట్రాక్ట్ అయ్యాను., వరంగల్ లో చాలా వేడిగా ఉందని అంటూ.. ఏప్రిల్ 19న నేను నటించిన లవ్ మౌళి లవ్ స్టోరీ మూవీ రిలీజ్ కాబోతుంది.. ఇది మంచి రొమాంటిక్ స్టోరీ అని తెలిపాడు.

Also Read: Rats Eat Ganja: పోలీస్ స్టేషన్‌లో నిల్వ ఉంచిన గంజాయి, భాంగ్ తినేసిన ఎలుకలు.. జార్ఖండ్‌ పోలీసుల నివేదిక..!

ఇక ఈ సినిమా 2021న ప్రారంభం జరిగిందని., ఆ తర్వాత ఎన్నో ఒడిదుడుకుల మధ్య ఏప్రిల్ 19న రిలీజ్ కాబోతుందని తెలిపాడు. మేఘాలయలో తీసిన ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని.. ఏప్రిల్ 19న అందరూ సినిమా థియేటర్ కు పెళ్లి సినిమా చూడాలని కోరుకుంటున్నట్లు నవదీప్ అన్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ మొదటిసారి వరంగల్ నుంచి స్టార్ట్ చేస్తున్నాని.. మీ అందరూ ఆదరిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు తెలిపాడు.

Exit mobile version