NTV Telugu Site icon

Pawan Kalyan-Navdeep: పవన్‌ కళ్యాణ్ కోసం ప్రచారం చేస్తా: నవదీప్‌

Navdeep

Navdeep

Navdeep on Janasena Chief  Pawan Kalyan: నవదీప్‌ హీరోగా అవనీంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లవ్‌ మౌళి’. నైరా క్రియేషన్స్‌, శ్రీకర స్టూడియోస్‌ పతాకాలపై సి స్పేస్‌ సంస్థ ఈ సినిమాను నిర్మించింది. పంఖురి గిద్వానీ హీరోయిన్‌గా నటించగా.. భావన సాగి, మిర్చి హేమంత్‌, మిర్చి కిరణ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఏప్రిల్‌ 19న లవ్‌ మౌళి సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ చేస్తోంది. ఇందులో భాగంగా బుధవారం పిఠాపురంలోని శ్రీపాద వల్లభుడిని చిత్ర యూనిట్ దర్శించుకుంది.

Also Read: Ambati Rayudu-SRH: సన్‌రైజర్స్ జట్టులోకి నన్నెందుకు తీసుకోలేదు.. మూడీని ప్రశ్నించిన రాయుడు!

లవ్‌ మౌళి ట్రైలర్‌ రిలీజ్‌ చేసిన సందర్భంగా శ్రీపాద వల్లభుడి ఆలయంలో చిత్ర బృందం పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో నవదీప్‌ విలేకరులతో మాట్లాడుతూ.. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు తన మద్దతు తెలుపుతూ ఎన్నికల ప్రచారం చేస్తానని తెలిపారు. నవదీప్‌ మీడియాతో మాట్లాడుతూ.. నిజాయతీగా ఎవరు పోటి చేసినా ప్రజలు ఆదరిస్తారన్నారు. పవన్‌కు తన మద్దతు ఉంటుందని తెలిపారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక్కడ సిట్టింగ్ ఎంపీ అయిన వంగా గీత.. వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు.