Site icon NTV Telugu

LIK: ప్రదీప్ రంగనాథన్ ‘LIK’ సెన్సార్ కంప్లిట్..

Lik Movie Censor

Lik Movie Censor

ప్రదీప్ రంగనాథన్ గురించి పరిచయం అక్కర్లేదు తన నటన డైరెక్షన్‌తో తమిళ, తెలుగులోనూ మంచి క్రేజ్ సంపాదించుకున్నా. ఇక ఆయన లేటెస్ట్ మూవీ ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ (Love Insurance Kompany) విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాలో ప్రదీప్ సరసన ‘బేబమ్మ’ కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా, వెర్సటైల్ యాక్టర్ ఎస్.జె. సూర్య ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారు. అనిరుధ్ రవిచందర్ అందించిన సాంగ్స్ ఇప్పటికే చార్ట్ బస్టర్లుగా నిలిచాయి. నయనతార మరియు ఎస్.ఎస్. లలిత్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో శ్రీ పద్మిని సినిమాస్ విడుదల చేస్తోంది. అయితే తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.

Also Read : Kiara Advani : అమ్మనయ్యాక.. అలా మారక తప్పలేదు..

సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి U/A సర్టిఫికేట్ జారీ చేసింది. ఇక ఈ సినిమా నిడివి విషయానికి వస్తే.. 2 గంటల 36 నిమిషాలుగా మేకర్స్ లాక్ చేశారు. ఒక యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్‌కు ఇది పర్‌ఫెక్ట్ రన్‌టైమ్ అని చెప్పొచ్చు. ఏప్రిల్ 10, 2026న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ప్రదీప్ రంగనాథన్ మార్క్ కామెడీ, విఘ్నేష్ శివన్ మార్క్ మేకింగ్‌తో తోడవ్వడంతో ఈ ‘LIK’ బాక్సాఫీస్ వద్ద మరో ‘లవ్ టుడే’ రేంజ్ హిట్ అవుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

Exit mobile version