Warangal: వరంగల్ లో ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం.. ఏం జరిగిందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రవ్యాప్తంగా ఈ మధ్య కాలంలో వరుసగా జరుగుతున్న ఆత్మహత్యలు తీవ్రంగా కలచి వేస్తున్నాయి. అమ్మాయి ప్రేమించడం లేదనో, ప్రేమించిన అమ్మాయి వేరే అబ్బాయిని పెళ్లాడిందనో, పెద్దలు తమ ప్రేమను అంగీకరించడం లేదనో ఇలా ప్రేమ పేరుతో రకరకాల కారణాల వల్ల యువతీ యువకులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వరంగల్ అండర్ బ్రిడ్జ్ సమీపంలోని ఏడు మోరీల దగ్గర రైలు పట్టాలపై ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో యువతి మృతి చెందగా.. యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనా స్థలానికి చేరుకున్న జీఆర్పీ పోలీసులు తీవ్ర గాయాలతో, రక్తపుమడుగులో పడి ఉన్న యువకుడిని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. మృతురాలు ఖమ్మం జిల్లా సారధి నగర్ కు చెందిన యువతిగా గుర్తించారు. చికిత్స పొందుతున్న యువకుడు వరంగల్ కాశిబుగ్గ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.
READ MORE: Chandrababu: ఆ నియామకాలు వాయిదా వేయాలి.. యూపీఎస్సీ ఛైర్మనుకు చంద్రబాబు లేఖ
Also Read
- Gold and Silver Prices Today: మరోసారి బంగారం ధరల పతనం.. నేటి గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవే..
- Chirag Paswan: జంతర్ మంతర్ దాడి కేసులో ట్విస్ట్.. భరద్వాజ్‌పై FIRకు చిరాగ్ పాశ్వాన్ డిమాండ్
- Vijay TVK Alliance: విజయ్ కూటమిలోకి ఎవరు..? మిత్రపక్షాల భేటీపై తమిళనాడులో పెరిగిన ఆసక్తి
- IND vs AFG T20: వైభవ్‌తో ఓపెనింగ్ జోడీ ఎవరు..?.. టీమ్ ఇండియా ప్రయోగంపై ఉత్కంఠ
ఈ ఆత్మహత్య యత్నానికి ప్రేమ వ్యవహారమే కారణమా? మరేదైనా కారణం ఉందా అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. యువతి మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎం మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకున్న జీఆర్పీ పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. కాగా.. ఈ ఘటన తెలియగానే యువతి, యువకుడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. యువకుడి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు పోలీసులు దర్యప్తు అనంతరం వెల్లడించే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Teachers Day Special: టీచర్ అంటే జీవితాన్ని మార్చేవాడు! తెలుగు తెరపై గురువును గుర్తుచేసే మూడు గొప్ప సినిమాలు
-
Gold and Silver Prices Today: మరోసారి బంగారం ధరల పతనం.. నేటి గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవే..
-
Trump: ట్రంప్ దేనికో భయపడుతున్నాడు? 50 మంది సైనిక అధికారులకు పాలిగ్రాఫ్ పరీక్షలు!
-
Ampere Magnus G Max: ఆంపియర్ మాగ్నస్ జి మ్యాక్స్.. 142KM రేంజ్.. 65KM స్పీడ్.. 34 లీటర్ల స్టోరేజ్!
-
Chirag Paswan: జంతర్ మంతర్ దాడి కేసులో ట్విస్ట్.. భరద్వాజ్‌పై FIRకు చిరాగ్ పాశ్వాన్ డిమాండ్
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!