జగిత్యాల జిల్లాలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. బిట్ కాయిన్ ట్రేడింగ్లో నష్టం రావడంతో సూసైడ్ కు పాల్పడ్డాడు. మృతి చెందిన విద్యార్థి ఓయూలో పీజీ చదువుతున్నాడు. మూడు రోజుల క్రితం ఓయూ క్యాంపస్ హాస్టల్ లో క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు కోరుట్లకు చెందిన నవీన్ గా గుర్తించారు. కాగా.. బిట్ కాయిన్ ట్రేడింగ్ లో రూ.3 లక్షల వరకు పోగొట్టుకున్నట్లుగా తెలుస్తుంది.
Read Also: South Central Railway: దక్షిణ మధ్య రైల్వేలో కేంద్ర బడ్జెట్ కేటాయింపులు ఎంతో తెలుసా..?
కాగా.. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందాడు విద్యార్థి నవీన్. ఆన్లైన్ గేమ్స్ కు బానిసై బిట్ కాయిన్స్ లో పెట్టుబడి కోసం క్రెడిట్ కార్డుల ద్వారా అప్పు చేసినట్లుగా గుర్తించారు. చేసిన అప్పు చెల్లించలేక పోవడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు విద్యార్థి తల్లిదండ్రులు చెబుతున్నారు. కాగా.. చేతికొందుచ్చిన కొడుకు ఇక లేడన్న బాధతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు వచ్చింది.
Read Also: Parliament: ఝార్ఖండ్, ప్రత్యేక దేశంపై లోక్‌సభలో రగడ.. విపక్షాల వాకౌట్