Site icon NTV Telugu

Earthquake: లాస్ ఏంజిల్స్‌లో భూకంపం.. రెక్టర్ స్కేల్‌పై 4.3గా నమోదు

Lee

Lee

అమెరికాను భూకంపం వణికించింది. కాలిఫోర్నియాలోని లాస్ ఏంజెల్స్ ప్రాంతంలో బుధవారం భూకంపం సంభవించింది. రికర్ట్ స్కేల్ భూకంప తీవ్రత 4.3గా నమోదైంది. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ప్రకారం బుధవారం మధ్యాహ్నం ఆరెంజ్ కౌంటీలో భూకంప సంభవించిందని పేర్కొంది. పెద్దగా నష్టం జరగలేనట్లుగా తెలుస్తోంది. కాకపోతే భూప్రకంపనలకు మాత్రం భవనాలు కుదుపులకు గురైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. మరోవైపు అధికారులు ప్రమాద నష్టంపై అంచనా వేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Delhi High Court : రూ.5 లక్షల కోట్ల విలువైన హెరాయిన్ మాయం.. కేంద్రానికి హైకోర్టు అక్షింతలు

ఇక భూప్రకంపనలకు ప్రజలు భయాందోళనకు గురై ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. పలు ప్రాంతాల్లో జనాలు ఈ పరిస్థితుల్ని ఎదుర్కొన్నారు. ప్రిలిమినరీ రికార్డుల ప్రకారం రెక్టర్ స్కేల్‌పై 4.1గా తీవ్రతను నమోదు చేశాయి. అనంతరం మరో రెండు పాయింట్లు పెరిగి మొత్తం 4.3గా నమోదైంది. భూకంపం కేంద్రం శాంటా అనా పర్వతాలలో గుర్తించారు. నైరుతి దిశలో 5.6 మైళ్ల దూరంలో ఈ భూకంపం సంభవించినట్లుగా అధికారులు కనుగొన్నారు.

ఇది కూడా చదవండి: T20 World Cup 2024: ప్రపంచకప్ జట్టును ప్రకటించని పాకిస్థాన్.. కారణం ఏంటంటే?

Exit mobile version