Site icon NTV Telugu

Lorry hits scooter: తీవ్ర విషాదం.. స్కూటీని ఢీకొన్న లారీ.. ముగ్గురు విద్యార్థులు మృతి

Ap

Ap

ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించడం, ఓవర్ స్పీడ్, నిర్లక్ష్యం కారణంగా రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాలు వందలాది కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నాయి. తాజాగా ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ తహశీల్దార్ కార్యాలయం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముగ్గురు విద్యార్థులు ప్రయాణిస్తున్న స్కూటీని లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ముగ్గురు గిరిజన విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

Also Read:Upasana : ఉపాసనకు కీలక బాధ్యతలు ఇచ్చిన సీఎం రేవంత్..

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులు కొరిసిల గ్రామానికి చెందిన కార్తీక్, ఉదయ్, జగన్ గా గుర్తించారు. మృతుల్లో ఒకే కుంటుంబానికి చెందిన ఇద్దరు అన్న దమ్ములు ఉన్నారు. ఉదయ్ కిరణ్ ఇంటర్ సెకండియర్ చదువుతుండగా, కార్తీక్ పాలిటెక్నిక్, జగన్ ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Exit mobile version