సంగారెడ్డి జిల్లా చౌటాకూర్ (మం) సరాఫ్ పల్లి వద్ద పోలీస్ వాహనాన్ని వెనుక నుండి లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జోగిపేట ఎస్సై పాండుగౌడ్ కు స్వల్ప గాయాలు అయ్యాయి. పోలీస్ వెహికల్ స్వల్పంగా ధ్వంసం అయ్యింది. గాయపడిన ఎస్సైని సంగారెడ్డి వెల్నెస్ హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఉదయం తెల్లవారుజామున జోగిపేట నుండి సంగారెడ్డి వైపు వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. నాందేడ్ అకోలా జాతీయ రహదారిపై ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో ప్రశ్నించేందుకు వాహనాన్ని ఆపిన సమయంలో ఘటన జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Sangareddy: పోలీస్ వాహనాన్ని వెనుక నుండి ఢీకొట్టిన లారీ.. జోగిపేట ఎస్సైకి స్వల్ప గాయాలు

Jogipet Si