రోడ్డు ప్రమాదాలు నెత్తుడి చారికలు పారిస్తున్నాయి. రంగారెడ్డి జిల్లాలో ఓ లారీ బీభత్సం సృష్టించింది. హైదర్ గూడ చౌరస్తా వద్ద పాద చారులపైకి దూసుకెళ్లిందో లారీ…బస్సు కోసం వేచిచూస్తున్న భార్యా భర్తలను ఢీకొట్టిన లారీ. లారీ చక్రాల కింద నలిగిపోయిన భర్త. అక్కడక్కడే ప్రాణాలు వదిలారు. లారీ కింద నుండి భార్యను లాగేసిన స్థానికులు. అయితే పెను ప్రమాదం తప్పింది. రోడ్డు ప్రమాదంతో ఉలిక్కి పడ్డారు రోడ్డుపై ఉన్న ప్రజలు. 100 కి ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు స్థానికులు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
Read Also: Nellore District: కలకలం రేపుతున్న ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి వివాదం
మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణం అంటున్నారు పోలీసులు. ఆర్టీసీ బస్సు, లారీ ఓవర్ టేక్ చేయడంతో పాదచారుల పైకి లారీ దూసుకొని వచ్చిందని చెబుతున్నారు స్థానికులు. భార్య కళ్ల ముందే కొట్టుమిట్టాడుతూ ప్రాణాలు విడిచింది భర్త. తీవ్రంగా గాయపడ్డ భార్యను ఆస్పత్రికి తరలించారు. కర్ణాటక ప్రాంతానికి చెందిన రత్తయ్య, మంజుల. పొట్ట చేత పట్టుకొని హైదరాబాద్ కు వచ్చారు. లారీ రూపంలో దూసుకొని వచ్చింది ప్రమాదం. దీంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నారు.
Read Also: Russian Ukrainian War: ప్రతీకారం తీర్చుకున్న రష్యా.. 600మంది ఉక్రెయిన్ల హతం