NTV Telugu Site icon

Kalki Vinayakudu: కాంప్లెక్స్‌ను పోలిన మందిరం.. అశ్వత్థామగా వినాయకుడు! వీడియో వైరల్‌

Kalki Ganesh

Kalki Ganesh

Kalki Ganesh in Tamil Nadu: దేశవ్యాప్తంగా వినాయక చవితి 2024 వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ‘గణపతి బప్పా మోరియా’ నినాదాలతో పట్టణం, గ్రామాల్లోని ప్రతి గల్లీ హోరెత్తిపోతోంది. చవితి వేడుకల సందర్భంగా బొజ్జ గణపయ్య పలు రూపాల్లో దర్శనమిచ్చాడు. ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్లుగా ఉన్న కొన్ని వినాయకుడి విగ్రహాలు భక్తులను ఆకర్షిస్తున్నాయి. అన్నికంటే ముఖ్యంగా ‘కల్కి’ వినాయకుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాడు. గతంలో బాహుబలి, పుష్ప వినాయక విగ్రహాలు ఆకట్టుకున్న విషయం తెలిసిందే.

రెబల్ స్టార్ ప్రభాస్‌ హీరోగా, నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కించిన ‘కల్కి 2898 ఏడీ’ ప్రపంచవ్యాప్తంగా బ్లాక్‌బస్టర్‌ హిట్ కొట్టింది. ఇందులో భైర‌వ పాత్రలో ప్రభాస్‌, అశ్వత్థామగా అమితాబ్‌ బచ్చన్‌, సుప్రీమ్ యాస్కిన్‌గా క‌మ‌ల్‌హాస‌న్‌ మెప్పించారు. బుజ్జి వెహికల్‌ సహా కంప్లెక్స్ కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. కల్కి మేనియా నేపథ్యంలో తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో కల్కి సెట్‌లా వినాయక మందిరం వేశారు. అచ్చం కాంప్లెక్స్‌ను పోలిన మందిరం, అశ్వత్థామగా వినాయకుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

Also Read: Rishabh Pant: ఎవరైనా అలా చెయ్‌.. ఇలా చెయ్‌మని చెబితే నచ్చదు: పంత్

కల్కి సినిమాలో మాదిరి కాంప్లెక్స్‌లో నుంచి లోపలికి వెళ్లేలా వినాయక మందిరంను డిజైన్‌ చేశారు. మందిరం లోపల సుప్రీమ్ యాస్కిన్‌ బొమ్మ, శివుడి విగ్రహం, అశ్వత్థామగా వినాయకుడిని ఏర్పాటు చేశారు. ఇది చూడ్డానికి అద్భుతంగా ఉంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ అశ్వత్థామ వినాయకుడిని చూసేందుకు భక్తులు ఎగబడుతున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు ఈ వినాయక మందిరంను చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు.